Bandla Ganesh: గురూజీకి గిఫ్ట్‌ ఇస్తే జరిగిపోద్దంతే.. ఆయన ఎవర్నైనా వేరు చేయగలడు!

ABN , First Publish Date - 2023-05-26T13:19:16+05:30 IST

హాస్యనటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh)సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! ఒకర్ని పొగడ్తల్లో ముంచేయాలన్నా... విమర్శలతో ఊపిరాడకుండా చేయాలన్నా ట్విట్టర్‌ని అస్త్రంగా వాడతారాయన.

Bandla Ganesh: గురూజీకి గిఫ్ట్‌ ఇస్తే జరిగిపోద్దంతే.. ఆయన ఎవర్నైనా వేరు చేయగలడు!

హాస్యనటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh)సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే! ఒకర్ని పొగడ్తల్లో ముంచేయాలన్నా... విమర్శలతో ఊపిరాడకుండా చేయాలన్నా ట్విట్టర్‌ని అస్త్రంగా వాడతారాయన. కొంతకాలంగా బండ్ల గణేష్‌కు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయి. Bandla ganesh comments on Trivikram) అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. తాజాగా బండ్ల చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఆ ట్వీట్‌ త్రివిక్రమ్‌ని ఉద్దేశించే అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్‌ (Trivikam) సినిమాలు చేయడం కన్నా కాంబినేషన్‌ సెట్‌ చేయడంలోనే బిజీగా ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలో బండ్ల గణేష్‌ చేసిన ట్వీట్‌ గురూజీని టార్గెట్‌ చేస్తూనే అన్నట్టుగా తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా బండ్ల గణేష్‌ అభిమానులతో కాసేపు ట్విట్టర్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్‌ అవ్వాలని ఉంది’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై హాట్‌ టాపిక్‌గా మారింది. ‘గురూజీని కలవండి. ఖరీదైన బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ బదులిచ్చారు. ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌ను చాలామంది గురూజీ అని పిలుచుకుంటారు. దాంతో బండ్ల ట్వీట్‌ త్రివిక్రమ్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరో నెటిజన్‌ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్ర్కీన్‌ప్లే రాసి అసలు కథను షెడ్‌కు పంపిస్తాడటగా అంటూ ప్రశ్నించాడు. దీనికి కూడా బండ్ల తనదైనశైలిలో స్పందించాడు. ‘‘అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ సంచలనంగా మారింది. మరి బండ్ల ఇంత బహిరంగంగా మాట్లాడడంతో త్రివిక్రమ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం త్రివిక్రమ్‌ మహేశ్‌ బాబు హీరోగా ఎస్‌ఎస్‌ఎంబీ28ను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-05-26T13:19:16+05:30 IST