సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దయచేసి ఆ చిన్నారికి సాయం చేయండి: బాలకృష్ణ

ABN, Publish Date - Apr 10 , 2026 | 03:56 PM

తన నియోజక వర్గమైన హిందూపురంలోని లేపాక్షి గ్రామానికి చెందిన పేద దంపతులు, తన కుమారుడికి వచ్చిన అరుదైన వ్యాధికి చికిత్స చేయించలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం తరపున తన వంతు సాయం అందిస్తానని తెలుపుతూనే, ఆ కుటుంబానికి అందరూ సాయం చేయాలని కోరారు బాలయ్య.

Balakrishna Wants Help for Child

ఓ చిన్నారిని కాపాడేందుకు, అందరూ ముందుకు రావాలని వేడుకుంటున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna). తన నియోజక వర్గమైన హిందూపురంలోని లేపాక్షి (Lepakshi) గ్రామానికి చెందిన పేద దంపతులు, తన కుమారుడికి వచ్చిన అరుదైన వ్యాధికి చికిత్స చేయించలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం తరపున తన వంతు సాయం అందిస్తానని తెలుపుతూనే, ఆ కుటుంబానికి అందరూ సాయం చేయాలని కోరారు బాలయ్య. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో..


‘‘అందరికీ నమస్కారం. మన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామ నివాసి నటరాజు (Nataraju) దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు) కి అత్యంత అరుదైన వ్యాధి- స్పైనల్ మస్క్యలర్ అట్రోఫీ టైప్ 2. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం బేబీ కేయాన్స్ అడ్విక్ గత 21 నెలలుగా ప్రాణాపాయమైన ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి అవసరమైన జీవరక్షక ఔషధం భారతదేశంలో తయారు కావడం లేదు. ఒక్క ఇంజెక్షన్ ధర రూ. 16 కోట్లు. ఇది ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన జీవరక్షక ఇంజెక్షన్. ఈ కుటుంబం నిన్నటిరోజున హిందూపురం పర్యటనలో ఉన్న నాతో వచ్చి కలిసి తమ బిడ్డ పరిస్థితిని తెలియజేసి మనందరి సహాయాన్ని కోరుకున్నారు. నా వంతుగా నేను సహాయం చేస్తూనే ప్రభుత్వ పరంగా కూడా నా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ.. ఇంత భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుకునే పరిస్థితిలో ఆ కుటుంబం లేదు. కావున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమవంతు సాయంగా ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.


అకౌంట్ వివరాలు:

Account- 8265662545

Name - AS Nataraj

IFSC - IDIB000J028

Branch - J P NAGAR

అభినందనలతో..

నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య కోరారు. ‘మా దేవుడే ఇలాంటి కోరిక కోరినప్పుడు, హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాం.. తప్పకుండా చేస్తాం’ అంటూ నందమూరి అభిమానులు ఈ పోస్ట్‌కు రియాక్ట్ అవుతున్నారు. ఒక మంచి పని కోసం బాలయ్య ఇచ్చిన ఈ పిలుపుతో.. అందరూ హెల్ప్ చేసి ఆ పిల్లాడిని కాపాడాలని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

కోసి కారం పెడ‌తా.. 'తిమ్మ‌రాజు ప‌ల్లి టీవీ' ట్రైల‌ర్ అదిరింది! తెలుగులో ఇలా కూడా సినిమాలు తీస్తున్నారా

సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Apr 10 , 2026 | 03:56 PM