ఏపీ నంది అవార్డుల దరఖాస్తు గడువు పొడిగింపు.. అక్టోబర్ 25 వరకు ఛాన్స్
ABN, Publish Date - Oct 14 , 2026 | 04:11 PM
ఏపీ నంది అవార్డుల దరఖాస్తు గడువును ఎఫ్డీసీ అక్టోబర్ 25 వరకు పొడిగించింది. 2017 నుంచి 2025 వరకు సినిమా, టీవీ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునే విధానం, చివరి తేదీ వివరాలు తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 నంది అవార్డులను త్వరలోనే ప్రదానం చేస్తానని ఇటీవల హామీ ఇచ్చింది. అలానే 2017 నుంచి 2024 వరకూ ఐదు కేటగిరిల్లో సినిమా, టీవీ అవార్డులను ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. దానితో పాటే 2025వ సంవత్సరానికి పూర్తి స్థాయిలో అవార్డులు ఇవ్వబోతున్నట్టు తెలిపింది. ఈ సంవత్సరాలకు గానూ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే కోరింది. అయితే ఆ గడువు అక్టోబర్ 16తో ముగియనుంది. తాజాగా గడువును ఈ నెల 25 వరకూ పొడిగిస్తూ ఎఫ్.డి.సి. నిర్ణయం తీసుకుంది.
2017 నుంచి 2025 వరకూ చలనచిత్ర, టీవీ అవార్డుల దరఖాస్తులకు సంబంధించిన వివరాలు Website: www.apsftvtdc.in నుంచి పొందవచ్చునని తెలిపింది. అక్టోబర్ 20వ తేదీ లోగా సంబంధిత ఫారంలను ఆన్ లైన్లో పూర్తిచేయాలని, వాటిని ప్రింట్ తీసి, సంబంధిత పత్రాలను జత పరిచి ఇదే నెల 25 లోగా ఎఫ్.డి.సి. కార్యాలయంలో సబ్ చేయాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో వివరించింది. దాంతో దరఖాస్తు గడువును తొమ్మిది రోజులు పొడిగించినట్టు అయ్యింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే జ్యూరీ నవంబర్లో దరఖాస్తులను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తే, డిసెంబర్ లో వాటిని విజయవాడ లేదా అమరావతిలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.
ఇవి కూడా చదవండి:
రామజోగయ్య శాస్త్రి తనయుడి సినీ అరంగేట్రం
Drishyam 3: 10 రోజుల్లోనే రూ.480 కోట్లు.. బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న దృశ్యం 3!
Akhil Raj: అనుపమతో కలిసి నటించాలన్న.. అమ్మ కోరిక నెరవేరింది