అడుక్కుతినరా.. అంత మాట అన్నావేంటి థమన్ అన్నా
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:40 PM
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలు, మ్యూజిక్ పక్కన పెడితే సోషల్ మీడియాలో ఆయన పంచే వినోదానికి కొదువే లేదు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ (Thaman) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలు, మ్యూజిక్ పక్కన పెడితే సోషల్ మీడియాలో ఆయన పంచే వినోదానికి కొదువే లేదు. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ సినిమాల అప్డేట్స్ తో పాటు నెటిజన్స్ కి అప్పుడప్పుడు స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటాడు. తన మీద కానీ, తన మ్యూజిక్ మీద కానీ ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళకు తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఉంటాడు. తాజాగా తన మ్యూజిక్ పై ఒక నెటిజన్ వేసిన పోస్ట్ కి థమన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
సాధారణంగా ఎక్స్ లో చాలామంది సాంగ్స్, మ్యూజిక్ వీడియోలు పెడుతూ మ్యూజిక్ డైరెక్టర్స్ ని ప్రశంసిస్తూ ఉంటారు. అలానే ఒక నెటిజన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించిన మ్యూజికల్ హిట్ అల వైకుంఠపురములో సినిమాలోని మూవీ గ్లింప్స్ను షేర్ చేస్తూ.. 'ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇచ్చాడంటే అసలు నమ్మబుద్ధి కాదు' అంటూ థమన్ ని పొగుడుతూనే సెటైర్ వేశాడు . ఇక ఈ పోస్ట్ కి థమన్ గట్టిగా రిప్లై ఇచ్చాడు. దూకుడులో బ్రహ్మానందం తన మామతో 'నమ్మొద్దురా.. అడుక్కుతిను' అనే డైలాగ్ క్లిప్ ని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా థమన్ వైపు చూసింది. అయ్యో థమన్ అన్నా ఎంత మాట అన్నావ్.. అంతా కోపం వచ్చిందా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇక థమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం AK 47, చిరంజీవి కాకా, బాలకృష్ణ దాదా సినిమాలతో పాటు ఇట్లు అర్జున చిత్రానికి కూడా ఆయనే మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అంతేకాకుండా ఒట్టకొంబన్ మూవీతో మాలీవుడ్లోకి అడుగుపెడుతున్న థమన్ లైనప్లో క్రేజీ ప్రాజెక్ట్ OG 2 కూడా ఉంది. మరి ఈ సినిమాలతో థమన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
రామజోగయ్య శాస్త్రి తనయుడి సినీ అరంగేట్రం
Drishyam 3: 10 రోజుల్లోనే రూ.480 కోట్లు.. బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న దృశ్యం 3!
Akhil Raj: అనుపమతో కలిసి నటించాలన్న.. అమ్మ కోరిక నెరవేరింది