రామజోగయ్య శాస్త్రి తనయుడి సినీ అరంగేట్రం

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:03 PM

ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చిన్న కుమారుడు సాయి హర్ష సంగీత దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘మైత్రీ ఇన్ లవ్‌’తో ఆయన పరిచయం కానున్నారు.

Ramajogaiah Sastry son Sai Harsha

ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తనయుడు సైతం ఇప్పుడు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఆయన చిన్న కుమారుడు సాయి హర్ష సంగీత దర్శకత్వం వహిస్తున్న 'మైత్రీ ఇన్ లవ్‌' మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో జై జాస్తి, మేథ మేక హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కథానాయిక మేధ... ప్రముఖ నటుడు శ్రీకాంత్‌, ఊహ దంపతుల కుమార్తె. గతంలో '30 వెడ్స్ 21', 'మిడిల్‌ బెంచ్‌ రవి' వెబ్ సీరిస్ లతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ వనం ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమాకు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు.


mil (2).jpeg

రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు సాయి తేజ విదేశాలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు సాయి హర్ష తండ్రి బాటలో చిత్రసీమలోకి రావడం విశేషం. అయితే తండ్రి మాదిరి గీత రచయితగా కాకుండా స్వరకర్తగా సాయి హర్ష తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ చిత్రంలో అవకాశం రావడం, న్యూ టాలెంట్‌తో కలిసి వర్క్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే... రామజోగయ్య శాస్త్రి గురువుగా భావించే 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కుమారుడు సాయి యోగేశ్వర్ సైతం కొన్ని సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆ రకంగా గురువు సీతారామశాస్త్రి బాటలోనే రామజోగయ్య శాస్త్రి కుటుంబం కూడా సినీ ప్రయాణం సాగిస్తోందని అనుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

RC 17: రామ్ చరణ్‌ జోడీగా.. విక్ర‌మ్ కూతురు

మమితా బైజు పెళ్లి.. నిజ‌మేనా!

మూడు పెళ్లిళ్లు.. ద‌ర్శ‌కుడిపై చెప్పుల‌తో కుటుంబ‌ స‌భ్యుల దాడి

జైలర్ 2 ఆన్‌లైన్ విడుదలపై హైకోర్టు నిషేధం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.40 కోట్లు!

Updated Date - Oct 14 , 2026 | 01:10 PM

ఎంజీఆర్ బయోపిక్.. జయల‌లిత‌గా త్రిష?

Suriya: మ‌రోసారి దాతృత్వం చాటుకున్న సూర్య‌.. విద్యార్థులకు ఆర్థిక సాయం

తమిళ సినిమాలోకి .. హీరోయిన్‌గా తెలుగమ్మాయి

Akhil Raj: అనుపమతో కలిసి నటించాలన్న.. అమ్మ కోరిక నెరవేరింది

నాని మళ్లీ లవ్ స్టోరీ బాటలోకి.. 96 డైరెక్టర్‌తో సినిమా?