Akhil Raj: అనుపమతో కలిసి నటించాలన్న.. అమ్మ కోరిక నెరవేరింది
ABN , Publish Date - Oct 14 , 2026 | 10:25 AM
అఖిల్ రాజ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘క్రేజీ కల్యాణం’ అక్టోబర్ 16న విడుదల కానుంది. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలోని యూనివర్సల్ ఎమోషన్స్, తన పాత్ర గురించి అఖిల్ రాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
"క్రేజీ కల్యాణం (Crazy Kalyanam) అన్ని వర్గాల ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. కథలో యూనివర్శల్ ఎమోషన్స్ ఉంటాయి' అని చెప్పారు అఖిల్ రాజ్ ఉడ్డెమారి. భద్రప్ప గాజుల తెరకెక్కించిన 'క్రేజీ కల్యాణం' చిత్రంలో అఖిల్ రాజ్ (Akhil Raj) కీలక పాత్ర పోషించారు. సినిమా ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో చిత్ర విశేషాలు పంచుకొన్నారు అఖిల్.
"నేనెప్పుడూ మంచి కథలో, మంచి సినిమాలో నటుడిగా భాగం కావాలని కోరుకుంటాను. నా క్యారెక్టర్ నిడివి ఎంత అనేది చూసుకోను. ఈ సినిమాలో నా పాత్రకు ఎంత ఎనర్జీ, ఫర్మామెన్స్ కావాలో అంత ఇచ్చాను. అనుపమ నటించిన 'రౌడీ బాయ్స్' చిత్రంలో ఓ చిన్న పాత్ర చేశాను.
అది చూసి మా అమ్మగారు 'నువ్వు హీరో అయితే ఈ అమ్మాయితో కలిసి నటించు' అని చెప్పారు. ఆమె కోరుకున్నట్లే ఈ చిత్రంలో అనుపమతో నటించడం సంతోషంగా ఉంది. 'క్రేజీ కల్యాణం' మన ఊరిలో జరిగే కథ. మన ఇంటిలో జరిగే కథ. అంతగా మన జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఇది తెలంగాణ నేపథ్య, యాసతో సాగే సినిమా అయినా అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి' అని అన్నారు.