నట విశ్వరూపం చూస్తారు.. మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం
ABN , Publish Date - Oct 14 , 2026 | 09:56 AM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న విడుదల కానుంది. ప్రీరిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ, రష్మిక చేసిన వ్యాఖ్యలు ఇవే.
రణబాలి (Ranabaali) మన తెలుగు సినీపరిశ్రమ గర్వపడేలా ఉంటుంది. మన భారతీయులంతా చాలా గొప్పోళ్లు. ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనా అన్నింటినీ ఎదిరించి ముందుకు వెళ్తుంటారు. ఈ సినిమాతో మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తా. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఎంతో మంది కృషి ఉంది. అందులో 'మైత్రీ మూవీ మేకర్స్' రవి, నవీన్ పాత్ర కూడా ఉంది. రష్మికకు ఉన్న అంకితభావం, సంకల్ప బలం నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంటుంది' అని హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda) అన్నారు.
ఆయన టైటిల్ రోల్లో రాహుల్ సాంకృ త్యాన్ (Rahul Sankrityan) తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి', రష్మిక మందన్న (Rashmika) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దసరా సందర్భంగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో నవీన్ యర్నేని మాట్లాడుతూ 'విజయ్, రష్మిక వివాహ బంధంలోకి అడుగు పెట్టాక చేసిన ఈ చిత్రం మాకు చాలా ప్రత్యేకం' అని తెలిపారు.
రవిశంకర్ మాట్లాడుతూ 'విజయ్ ఇలాంటి మరిన్ని గొప్ప సినిమాలు చేయాలని ఆశిస్తున్నాము' అని చెప్పారు. రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ 'ఈ సినిమాలో విజయ్ నట విశ్వరూపం చూస్తారు' అని పేర్కొన్నారు. రష్మిక మాట్లాడుతూ 'రణబాలి' మీ అందర్నీ మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. 'జయమ్మ' లాంటి గొప్ప పాత్రను పోషించినందుకు గర్వపడుతున్నా. త్వరలోనే ఇద్దరం కలసి ఓ మంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తాం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు హరీశ్ శంకర్, బుచ్చిబాబు సానా, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, రాహుల్ రవీందర్, రవికిరణ్ కోలా, శౌర్యువ్ తదితరులు పాల్గొన్నారు.