సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

స్ట్రీట్‌ ఫైటర్ ప్రీమియర్‌... విమర్శకుల ప్రశంసలు

ABN, Publish Date - Oct 14 , 2026 | 01:46 PM

పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన ‘స్ట్రీట్ ఫైటర్’ సినిమాకు తొలి స్పందనలు పాజిటివ్‌గా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు, హాస్యం, నటీనటుల ప్రదర్శనపై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు.

Street Fighter Movie

ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారతదేశంలో ఈ సినిమాను నాలుగు భాషల్లో ఇంగ్లీష్‌, హిందీ,తెలుగు, తమిళంలో రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో టి.సి.ఎల్‌. చైనీస్ థియేటర్‌లో ఈ సినిమా ప్రీమియర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటులు నోహ్ సెంటినియో, ఆండ్రూ కోజి, జాసన్ మోమోవా, 50 సెంట్, రోమన్ రీన్స్‌తో పాటు భారతీయ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.


ఈ సినిమా తొలి స్పందనలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, హాస్యం, 90ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సన్నివేశాలు, ప్రముఖ వీడియో గేమ్‌కు దగ్గరగా కథను తెరకెక్కించిన విధానం విమర్శకులను సైతం ఆకట్టుకుంటున్నాయి. సినీ విశ్లేషకుడు బ్రాండన్ డేవిస్ ఈ సినిమాను ‘విన్నర్’గా అభివర్ణించారు. 90ల నాటి వాతావరణం, వినోదం, నటీనటుల ప్రదర్శన ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఆండ్రూ కోజి ర్యూ పాత్రలో బాగా నటించారని, రోమన్ రీన్స్ అకుమా పాత్రలో భయపెట్టేలా కనిపించారని ప్రశంసించారు. థామస్ అనే మరో సినీ విశ్లేషకుడు ‘స్ట్రీట్ ఫైటర్’ను అత్యుత్తమ వీడియో గేమ్ ఆధారిత చిత్రాల్లో ఒకటిగా అభివర్ణించారు. గేమ్‌లోని ప్రత్యేకతలను సినిమాలో చక్కగా చూపించారని, దర్శకుడు కిటావో సకురాయ్ నటీనటుల నుంచి మంచి ప్రదర్శన రాబట్టారని పేర్కొన్నారు. కాలినా లియాంగ్, కోడి రోడ్స్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.


ఏజే గలియార్డీ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. యాక్షన్, స్టైల్, వినోదం కలగలిసిన చిత్రంగా అభివర్ణిస్తూ, నోహ్ సెంటినియో, ఆండ్రూ కోజి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని తెలిపారు. చున్-లి పాత్రలో కాలినా లియాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారని పేర్కొన్నారు. సుబాట్యూబ్ తన స్పందనలో ఈ సినిమా వీడియో గేమ్ అభిమానులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. గేమ్‌కు సంబంధించిన ప్రత్యేక సన్నివేశాలు, అద్భుతమైన సంగీతం, 2డీ యానిమేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అభిప్రాయపడ్డారు. విమర్శకుడు క్రిస్ కిలియన్ ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. 80ల నాటి యాక్షన్ సినిమాలను గుర్తుచేసేలా భారీ పోరాటాలు, హాస్యం ఉన్నాయని తెలిపారు. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో చూపించిన యానిమేషన్ కూడా అద్భుతంగా ఉందని, వీడియో గేమ్‌కు న్యాయం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించారని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

ఎంజీఆర్ బయోపిక్.. జయల‌లిత‌గా త్రిష?

పృథ్వీ షాతో మళ్లీ కలిసిన ఆకృతి అగర్వాల్.. బ్రేకప్ తర్వాత కీలక నిర్ణయం

నాని మళ్లీ లవ్ స్టోరీ బాటలోకి.. 96 డైరెక్టర్‌తో సినిమా?

Updated Date - Oct 14 , 2026 | 01:50 PM