దసరా వేళ అమ్మవారి సన్నిధిలో బోయపాటి శ్రీను.. విజయవాడ ఉత్సవాలపై ప్రశంసలు!
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:20 AM
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఉత్సవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దసరా శరన్నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను(kanaka durga temple) ప్రముఖ సినీదర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం మీడియా పాయింట్ వద్ద బోయపాటి మాట్లాడుతూ, దసరా పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందన్నారు. ఒకప్పుడు దసరా ఉత్సవాలు (dasara utsav) అంటే మైసూరు గుర్తుకొచ్చేదని.. ఇప్పుడు మన విజయవాడ (vijayawada)లో నిర్వహిస్తున్న 'విజయవాడ ఉత్సవ్', 'సరస్ బజార్' వంటి విశేష కార్యక్రమాలతో నగర ఖ్యాతి దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు.