శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. నెట్టింట క్రేజీ పిక్ వైరల్

ABN , Publish Date - Nov 25 , 2026 | 08:41 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎలాంటి స్టార్ హీరో అయినప్పటికీ.. ఫ్యామిలీకి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత ఎప్పుడూ వార్తలలో హైలెట్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆయన ఫ్యామిలీ మ్యాన్ కూడా.

Allu Family Pic

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఎలాంటి స్టార్ హీరో అయినప్పటికీ.. ఫ్యామిలీకి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత ఎప్పుడూ వార్తలలో హైలెట్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆయన ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, కుటుంబానికి సమయం కేటాయించడంలో బన్నీ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అల్లు ఫ్యామిలీ (Allu Family) అంతా కలిసి శ్రీలంకలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. నవంబర్ 21న బన్నీ గారాలపట్టి అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్, ఫ్యామిలీ వెకేషన్‌లో భాగంగా అల్లు కుటుంబమంతా కలిసి శ్రీలంక (Srilanka)లోని ఓ రిసార్ట్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్న అద్భుతమైన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలను అల్లు శిరీష్ భార్య నయనికా రెడ్డి (Nayanika Reddy) తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.


ఈ ఫొటోలో అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే ఫ్రేమ్‌లో ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ఓపెన్-ఎయిర్ రిసార్ట్ డైనింగ్ టేబుల్ వద్ద క్యాండిల్ లైట్ వెలుతురులో అల్లు అర్జున్ స్టైలిష్ క్యాజువల్ లుక్‌లో (గ్రే జెర్సీ టీ-షర్ట్, న్యూ హెయిర్ స్టైల్‌తో) అదరగొడుతున్నారు. ఆయన పక్కనే తండ్రి అల్లు అరవింద్, శిరీష్ భార్య నయనిక కూర్చోగా.. ఎదురుగా తల్లి నిర్మల, తమ్ముడు అల్లు శిరీష్, బన్నీ సతీమణి అల్లు స్నేహా రెడ్డి కనిపిస్తున్నారు. ఇక టేబుల్ ముందు వైపు బన్నీ పిల్లలు అల్లు అయాన్, బర్త్‌డే గర్ల్ అల్లు అర్హ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కెమెరాకు ఫోజులిచ్చారు. ఇక ఈ పిక్‌లో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు.


Nayanika-Reddy.jpg

ఈ ఏడాది మార్చిలో అల్లు శిరీష్, నయనికల వివాహం జరిగిన తర్వాత, అల్లు కుటుంబమంతా కలిసి ఇలా విదేశీ వెకేషన్‌లో సందడి చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘పుష్ప 2: ది రూల్’ వంటి పాన్-ఇండియా ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్టు ‘రాకా’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ విరామ సమయంలో ఫ్యామిలీతో కలిసి శ్రీలంక అందాలను ఆస్వాదిస్తున్న బన్నీ ఫ్యామిలీ పిక్‌పై ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘రాకా’ తర్వాత మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో మూవీ చేయనున్నారు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికైతే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.. ఈ పిక్‌‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

‘నాన్న కుట్టి’ ఫస్ట్ హాఫ్ బేస్‌.. సెకండాఫ్ ఎమోషన్: విజయ్ ఆంటోని

కచ్చితంగా నో చెప్తా.. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ బోల్డ్ ఆన్సర్

‘కింగ్‌ 100’ వాయిదా తప్పదా.. ఇక స్టార్ట్ చేయండయ్యా

Updated Date - Nov 25 , 2026 | 08:41 AM

Allu Family: అల్లు వారి ఇంట దివాళీ సంబురం.. కొత్త కోడ‌లు రాక

Allu Arjun - Atlee: అల్లు అర్జున్‌ కసి అదే.. పెద్ద ప్లానే ఇది...

Allu Arjun - Atlee: కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం.. ఒక రేంజ్‌లో ఉంటుంది..

Allu Arjun - Ram Charan: చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారెందుకు ?

Allu Sirish: అల్లు శిరీష్‌ లవ్‌స్టోరీ.. ఎలా మొదలైందంటే..