సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కాజల్ అగర్వాల్‌పై కూరగాయలతో దాడి.. పోస్టర్ వైరల్

ABN, Publish Date - Jul 10 , 2026 | 08:38 PM

కాజల్ అగర్వాల్‌ పై కూరగాయలతో దాడి.. అనగానే అంతా నిజమని అనుకుంటారేమో.. అది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌‌లోనేలే.. కంగారు పడొద్దు. జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’.

The India Story Poster

కాజల్ అగర్వాల్‌ (Kajal Aggarwal) పై కూరగాయలతో దాడి.. అనగానే అంతా నిజమని అనుకుంటారేమో.. అది రియల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌‌లోనేలే.. కంగారు పడొద్దు. జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ (The India Story). ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథ అందించడంతో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సమాజానికి సంబంధించిన కీలక అంశాన్ని కోర్ట్‌రూమ్ డ్రామా రూపంలో చూపిస్తున్న ఈ సినిమా.. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తున్నారు.


విషపూరిత పురుగుమందుల వ్యవసాయం, దాని వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావం వంటి కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలోని కొత్త పోస్టర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్‌ని గమనిస్తే.. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade) తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. ఒక భయానక నిజాన్ని బయటపెట్టేందుకు వారు చేసే పోరాటాన్ని ఈ పోస్టర్ సూచిస్తోంది. కూరగాయల మార్కెట్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ పోస్టర్‌లో ఇద్దరూ ఆగ్రహంతో ఉన్న వ్యాపారుల మధ్య చిక్కుకున్నట్లు చూపించారు. చుట్టూ ఉన్న జనాలు వారిపై కూరగాయలు విసురుతూ, వేలెత్తి చూపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కాజల్, శ్రేయాస్ తల్పాడే ఇద్దరి ముఖాల్లో కనిపించే భయం, చుట్టూ నెలకొన్న ఉద్రిక్త వాతావరణం చూస్తుంటే.. నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసే వారికి ఎదురయ్యే ప్రతిఘటనను బలంగా ఈ పోస్టర్ చూపిస్తోంది. ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్..’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ ట్యాగ్‌లైన్ సినిమా ప్రధాన అంశాన్ని మరింత స్పష్టంగా చెబుతోంది. లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపుతున్న ఒక ప్రమాదాన్ని ఈ సినిమా తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా ఇది సూచిస్తోంది. ఈ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకుడు చేతన్ డీకే మాట్లాడుతూ.. ఈ పోస్టర్ మోసంతో నడిచే వ్యవస్థను ప్రశ్నిస్తే మొదట ఎదురయ్యేది భయం, ఆగ్రహాన్ని తెలియజేస్తుంది. ‘ది ఇండియా స్టోరీ’లోని ప్రతి సన్నివేశం ఆ పోరాటాన్ని చూపించడంతో పాటు, మనం తినేది, నమ్మేది గురించి ప్రేక్షకులు ఆలోచించేలా చేస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్‌

2026: జనవరి టు జూలై.. కర్ణాటకలో హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాలివే..

టాక్సిక్.. బాబోయ్ రెమ్యునరేషన్స్‌కే రూ. 100 కోట్లకు పైగా..!

Updated Date - Jul 10 , 2026 | 08:38 PM