Ramayana - Arun Govil: తెరపై నటుడిని కాదు.. దేవుడినే చూస్తారు..

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:59 PM

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా(Ranbir kapoor), సాయిపల్లవి సీతగా (Sai pallavi) నటిస్తున్నారు.

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా (Ranbir kapoor), సాయిపల్లవి సీతగా (Sai pallavi) నటిస్తున్నారు. నితీష్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్ర నిర్మిస్తున్నారు.   రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణం’ సీరియల్‌లో శ్రీరాముడిగా నటించిన అరుణ్‌ గోవిల్‌ (Arun Govil) ఈ చిత్రంలో దశరథుడిగా నటించనున్నారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇలాంటి చిత్రాల్లో నటీనటుల లుక్స్‌పై ప్రేక్షకులు బాగా దృష్టి పెడతారు. వారిని జీవితమంతా అదే పాత్రలో గుర్తు పెట్టుకుంటారు’ అని అన్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు నితీశ్‌ తివారీ మాట్లాడుతూ ‘చరిత్ర, పురాణాలకు సంబంధించిన చిత్రాలలో వస్తున్నాయంటే చాలా పోలికలు ఉంటాయి. ప్రేక్షకులు కూడా కంపేర్‌ చేస్తారు. మనం దేవుడి పాత్ర పోషించేటప్పుడు చూడగానే అలానే కనిపించాలి. ఈ తరహా కథలకు లుక్స్‌ చాలా ముఖ్యం. ఆడియన్‌ తెరపై మనల్ని చూడరు... మన పాత్రలో ఉన్న దేవుడిని చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉండటాడేమో అనుకోవాలి. అంతలా మనం ప్ఘ్రభావితం చేయాలి’ అన్నారు. దయచేసి ఈ చిత్రాన్ని ‘ఆదిపురుష్‌’తో పోల్చవద్దని, ఏ చిత్రానికదే ప్రత్యేకమని ఆయన చెప్పారు.

'ఆదిపురుష్‌' సినిమా వచ్చినప్పుడు ఎన్నో నెగెటివ్ కామెంట్స్‌ వచ్చాయి. రామానంద్‌ సాగర్‌ తీసిన 'రామాయణం' సీరియల్‌లో నటించిన అరుణ్‌ గోవిల్‌ (రాముడు), దీపికా చిఖ్లియా (సీత), సునీల్‌ లాహ్రీ (లక్ష్మణుడు) పాత్రలను దర్శకుడు తెరకెక్కించిన తీరు, లుక్స్‌పై ఎన్నో కామెంట్స్‌ చేశారు. ఈ తరహా చిత్రాలు తీసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నితీశ్‌ తివారీ 'రామాయణ' సినిమా ప్రారంభించే సమయంలో కూడా ఇలాంటి కామెంట్స్‌ వచ్చాయి. అయితే ప్రపంచం మొత్తం ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా ఇది ఉంటుందని దర్శకనిర్మాతలిద్దరూ సవాల్‌ చేసి సినిమా ప్రారంభించారు.
 
నిర్మాత నమిత్‌ మల్మోత్ర ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్‌ చేశారు. సుమారు రూ.4,000 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో రావణుడిగా యశ్‌, హనుమంతుడిగా  సన్నీదేవోల్‌ నటిస్తున్నారు. మొదటి పార్ట్‌ను ఈ ఏడాది దీపావళికి, రెండో పార్టును 2027 దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Updated Date - Feb 02 , 2026 | 04:29 PM