సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏఆర్ రెహమాన్‌కు ట్రోలింగ్.. ‘రామాయణం’ పాటపై విమర్శలు!

ABN, Publish Date - Oct 27 , 2026 | 01:07 PM

రామాయణం సినిమాలోని ‘మంగళ రంగ్’ పాటపై ఏఆర్ రెహమాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాయిపల్లవి, రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రంలోని పాట ఖవ్వాలీని పోలి ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై రెహమాన్ స్పందించారు.

Ramayana Movie

ఆస్కార్‌ విజేత, ఎ.ఆర్. రెహమాన్ మరోసారి నెటిజన్స్ ట్రోలింగ్‌కు గురి అవుతున్నారు. అయితే ఈసారి అది 'రామాయణం'కు ఆయన ఇచ్చిన పాట కారణంగా! నవంబర్ 5న దీపావళి కానుకగా 'రామాయణ' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచారాన్ని వేగవంతం చేసిన మేకర్స్ 'మంగళ రంగ్‌' అనే గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. సాయిపల్లవి, రణబీర్‌ కపూర్ సీతా రాములుగా నటించిన ఈ చిత్రంలో వారిపైనే ఈ పాటను చిత్రీకరించారు. అయితే ఈ పాట వెలువడగానే ఇది 'ఖవాలీ'ని పోలి వుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సూఫీ ఖవ్వాలీ బీట్‌ను ఈ పాటకు రెహ్మాన్ ఉపయోగించడం దారుణం అంటూ కొందరు బాహాటంగా సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మరికొందరైతే గతంలో రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన 'ఛావా' సినిమాలోనూ ఇలానే జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఇంకొందరు... ఇది రెహ్మాన్‌ గతంలో స్వరాలు సమకూర్చిన తమిళ చిత్రంలోని పాటను గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు.


నిజం చెప్పాలంటే... ఇప్పటికే 'రామాయణం'లో సీతాదేవిగా నటిస్తున్న సాయిపల్లవిపై ట్రోలింగ్‌ జరుగుతోంది. ఆమె సీత పాత్రలో అస్సలు నప్పలేదని, ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ చూసి కొందరు జడ్జ్ చేస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత గానీ సాయి పల్లవి ఆ పాత్రకు ఏమేరకు న్యాయం చేకూర్చిందనేది చెప్పలేం. అయితే తాజాగా తన పాటపై వస్తున్న విమర్శలకు ఎ.ఆర్. రెహమాన్‌ దీటైన జవాబు చెప్పారు. 'తాను 'రాక్‌ స్టార్‌, స్లమ్‌ డాగ్‌' వైభవంతో ఆగిపోనని అన్నారు. 'ఎవరైనా ఒకచోట అలానే ఆగిపోవడం సరైనది కాదని, ప్రవహించే నదిలా ఉండాల'ని రెహ్మాన్ హితవు పలికారు. ఐదు భాషల్లో స్వరాలను సమకూర్చడం అనేది పెద్ద బాధ్యత అని తెలిపారు. తన సంగీతం పరిణామం తప్పితే పునరావృతం కాదని రెహ్మాన్‌ బదులిచ్చారు. మరి దీనితో ఎంతమంది ఏకీభవిస్తారో చూడాలి. ఏదేమైనా... యశ్‌ 'టాక్సిక్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడని నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అతను రావణాసుడిగా నటించి, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న 'రామాయణం' పై దృష్టి నిలిపారు. దానికి తోడు ప్రభాస్‌ నటించిన 'ఆదిపురుష్‌' సినిమా సైతం తీవ్ర నిరాశకు గురిచేసిన కారణంగా ఇప్పుడు నితేశ్‌ తివారీ రూపొందించిన 'రామాయణం' ఎలా ఉంటుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Alias Rukmini: రుక్కు రుక్కు రుక్మిణి.. కిట్టయ్యకి నువ్వే అలివేణి

Scene: సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్..

బాత్రూమ్‌లో జారి ప‌డి.. పైకి లేవ లేని స్థితిలో ఒంట‌రిగా షావుకారు జానకి కుమార్తె!

Updated Date - Oct 27 , 2026 | 01:21 PM