రూ. కోటి బోనస్‌.. ఎక్కడుందో చెబితే తెచ్చుకుంటా: ‘ధురంధర్’ జమిల్ సాబ్‌!

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:18 PM

‘ధురంధర్ 2’ సిరీస్ చిత్రాలతో టాక్ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారిన బాలీవుడ్ నటుడు రాకేష్ బేడీ‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తపై ఆయన ఫన్నీగా స్పందించారు.

Dhurandhar actor Rakesh Bedi

‘ధురంధర్ 2’ సిరీస్ చిత్రాలతో టాక్ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా మారిన బాలీవుడ్ నటుడు రాకేష్ బేడీ‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ‘ధురంధర్’ (Dhurandhar) రెండు పార్ట్‌లకు కలిపి రాకేష్ బేడీ (Rakesh Bedi)కి రూ. 50 లక్షలు పారితోషికాన్నే చెల్లించిన నిర్మాతలు.. సినిమా సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకుని అదనంగా రూ. కోటి చెల్లించినట్లుగా వైరల్ అవుతున్న వార్తలపై, సదరు నటుడు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘ధురంధర్’ పార్ట్ 2 సంచలన విజయం సాధించి, కలెక్షన్ల సునామీ సృష్టించడంతో ఆదిత్య ధర్, లోకేష్ ధర్‌‌లు రాకేష్ బేడీ‌కి మరో రూ. 1 కోటి అదనంగా అందచేశారనేది వినిపిస్తున్న వార్త. ఈ వార్తపై.. ఆ రూ. కోటి ఎక్కడున్నాయో చెబితే వెళ్లి తెచ్చుకుంటానంటూ జమిల్ సాబ్‌ సెటైర్ వేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియోలో..


‘‘చాయ్ విత్ రాకేష్ బేడీకి స్వాగతం. ఈ మధ్య ఇంటర్నెట్‌లో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. చాలా మంది నాకు ఆ వీడియోను పంపుతున్నారు. నా స్నేహితులు, అలాగే కొంతమంది జర్నలిస్టులు పంపిస్తున్నారు. ఆ వీడియో సారాంశం ఏమిటంటే.. ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) సినిమా తర్వాత నాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కోటి రూపాయలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. సరే భయ్యా.. ఆ డబ్బు ఎక్కడుంది? ఎవరి ఇంట్లో పెట్టారు? ఎవరి జేబులో ఉంది? నాకూ చెప్పండి భయ్యా! ఎక్కడో దాచిపెట్టినట్లున్నారు, ఎక్కడుందో చెబితే వెళ్లి తెచ్చుకుంటాను. ఎందుకంటే నా అకౌంట్‌లో ఇప్పటివరకు ఆ డబ్బు రాలేదు, నా బ్యాంక్ అకౌంట్‌లో ఆ డబ్బు చూపించడం లేదు.


ఒకవేళ ఆ డబ్బు వస్తే చెప్తాను.. లేదా చెప్పకపోయినా ఉండొచ్చు. కానీ ప్రస్తుతం అయితే నాకు రాలేదు భయ్యా, ఇప్పటివరకు అయితే ఆ డబ్బు అందలేదు. ఒకవేళ మీరెవరైనా ఇప్పించగలరు అంటే.. ప్లీజ్ ఇప్పించండి!’’ అంటూ జమిల్ సాబ్‌ అదే రాకేష్ బేడీ ఫన్నీగా స్పందించారు. అయితే ఆ వెంటనే ఆయన ఈ వీడియోను డిలీట్ చేయడం విశేషం. దీంతో, నిజంగానే ఆయనకు చిత్ర నిర్మాతలు రూ. కోటి ఇస్తానని చెప్పి ఉంటారు.. అందుకే డిలీట్ చేశారంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, జమిల్ పాత్ర ‘దురంధర్’ పార్ట్ 2‌లో ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉందో తెలియంది కాదు. అతనొక ఇండియన్ స్పై ఏజెంట్‌ అనే ట్విస్ట్‌కి అంతా షాకవుతారు.

ఇవి కూడా చదవండి:

తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!

ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!

Updated Date - Apr 24 , 2026 | 04:18 PM

Dhurandhar 2: దావూద్‌పై వర్మ సంచలన వ్యాఖ్యలు!

Dhurandhar 2: నాగపూర్‌ ఆర్.ఎస్.ఎస్. ఆఫీస్‌లో రణవీర్ సింగ్‌...

Dhurandhar OTT: దురంధర్ ఓటీటీకి వ‌చ్చేశాడు! తెలుగులో కూడా.. సినీ ల‌వ‌ర్స్‌కు ఇక పండ‌గే

Dhurandhar: ఒక్కో రికార్డును బ్రేక్‌ చేసుకుంటూ దర్జాగా..

Dhurandhar The Revenge: ఇదెక్క‌డి క్రేజ్‌రా.. రిలీజ్‌కు ముందే సునామీ సృష్టిస్తోంది