ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం!
ABN , Publish Date - Apr 25 , 2026 | 02:54 PM
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు, రెబల్ స్టార్ ప్రభాస్‌కు మధ్య భారీ పోటీ జరగబోతోంది. రాబోయే ఏడాదిలో వారిద్దరి సినిమాల మధ్య క్లాష్ ఉండబోతోందంటూ ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు ప్రస్తుతం కాలం కలిసిరావడం లేదు. ఒకప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సల్మాన్‌ఖాన్, 2016లో వచ్చిన ‘సుల్తాన్’ సినిమా తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్‌ను చూడలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘టైగర్ 3, సికిందర్’ సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన ‘మాతృభూమి’ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దీంతో సల్మాన్ మార్కెట్ పడిపోతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) రంగంలోకి దిగారు.
ఎంతో కాలంగా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న దిల్ రాజు ఈ సారి దర్శకుడు వంశీ పైడిపల్లిని రంగంలోకి దించి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాతోనైనా సల్మాన్ బాక్సాఫీస్ వద్ద తన పూర్వ వైభవాన్ని పొందుతారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది..! సల్మాన్ ఖాన్‌కు ఈద్ అంటే చాలా సెంటిమెంట్. ప్రతి ఏటా తన సినిమాను ఆ పండుగకే రిలీజ్ చేస్తారు. రాబోయే ఏడాది కూడా మార్చి 9 లేదా 10 తేదీల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే.. అంతకంటే ముందే, అంటే మార్చి 5న పాన్ ఇండియా వైడ్ ఒక భారీ తుపాను రాబోతోంది. అదే.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ (Spirit).
‘యానిమల్’ తర్వాత సందీప్ వంగా నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ఇప్పటికే విడుదలైన ఆడియో టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ‘స్పిరిట్’పై అంచనాలను భారీగా పెంచేశాయి. వచ్చే ఏడాది అందరికన్నా ముందే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో మిగతా హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటారు. కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం పక్కాగా అదే వారంలో బరిలోకి దిగుతున్నారు. ‘స్పిరిట్’ రిలీజ్ అయిన కేవలం 5 రోజుల గ్యాప్‌లోనే సల్మాన్ సినిమా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ 5 రోజుల గ్యాప్ అనేది రెండు సినిమాలపై ప్రభావం చూపుతుంది. ‘స్పిరిట్’కు టాక్ పాజిటివ్‌గా వస్తే, ఆ ప్రభంజనాన్ని తట్టుకోవడం సల్మాన్ సినిమాకు చాలా కష్టం. ఒకవేళ ‘స్పిరిట్’ ఏ కారణం చేతనైనా వాయిదా పడితే మాత్రం సల్మాన్ ఖాన్‌కు అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అంతేకాకుండా, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కానీ సల్మాన్ ఫ్యాన్స్ కూడా తమ సుల్తాన్ ఇచ్చే కంబ్యాక్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సో.. చూడాలి మరి! ఒకవైపు రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్, మరోవైపు కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఈ యుద్ధంలో నెగ్గేది ఎవరో కాలమే నిర్ణయించాలి.
ఇవి కూడా చదవండి:
Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!