Naseeruddin Shah: రంగస్థలంపై సాల్మన్‌ రష్దీగా!

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:50 AM

ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా త్వరలో రంగస్థలంపై సాల్మన్‌ రష్దీ పాత్రలో కనిపించనున్నారు. రష్దీ రాసిన ‘నైఫ్‌’ పుస్తకం ఆధారంగా రూపొందుతున్న ‘27 సెంకడ్స్‌’ నాటకంలో ఆయన నటించనున్నారు.

Naseeruddin Shah

నసీరుద్దీన్ షా గొప్ప వెండితెర నటుడే కాదు. రంగస్థల కళాకారుడు కూడా. ఆయన తన కెరీర్ ను ప్రారంభించిందే నాటకాల ద్వారా. ఈ వయసులోనూ నసీరుద్దీన్ షా నాటక రంగానికి దూరం కాలేదు. సమయం లభించాలే కానీ రంగస్థలం మీద తన ప్రతిభను ప్రదర్శించడానికి వెనకాడరు. ఇటీవల వచ్చిన 'మై వాపస్ ఆవూంగా' చిత్రంలో నజీరుద్దీన్ షా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించారు. 1947లో దేశ విభజన సమయం నాటి కథతో ఈ సినిమాను ఇంతియాజ్ అలీ తెరకెక్కించారు. ఇందులో 95 సంవత్సరాల వృద్ధుడి పాత్రను నసీరుద్దీన్ షా పోషించారు.


విశేషం ఏమంటే ఆయన త్వరలో రంగస్థలం మీద ప్రఖ్యాత రచయిత సాల్మన్ రష్దీ పాత్రలో కనిపించబోతున్నారు. '27 సెంకడ్స్' పేరుతో ప్రదర్శితం కాబోతున్న స్టేట్‌ ప్లే లో ఆయన నటిస్తున్నారు. సాల్మన్ రష్దీ 2024లో రాసిన 'నైఫ్‌: మెడిటేషన్స్, ఆఫ్టర్ యాన్‌ అటెంప్ట్‌డ్‌ మర్డర్' ఆధారంగా ఈ నాటకం రూపుదిద్దుకుంటోంది. 2022 ఆగస్ట్ 12న న్యూయార్క్ లో సాల్మన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. ఆ దాడి కత్తిదాడిలో ఆయన తన కుడి కంటి చూపును కోల్పోయారు. ఈ అనుభవాల ఆధారంగా రాసిన పుస్తకంలోని సన్నివేశాలనే ఇప్పుడు స్టేజ్ ప్లేగా చూపబోతున్నారు. ఈ నాటకానికి నసీరుద్దీన్ షాతో పాటు అర్ఘ్య లాహిరి దర్శకత్వం వహిస్తారు. మలౌకా చౌదరి, రష్దీ భార్య రాచెల్ ఎలిజా గ్రిఫిత్స్ ఇందులో నటించబోతున్నారు. మరి వివాదాస్పద రచయితగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్దీ పాత్రలోకి నసీరుద్దీన్ షా ఎలా పరకాయ ప్రవేశం చేస్తారో చూడాలి!

ఇవి కూడా చదవండి:

అమలా పాల్ గ్లామరస్ ఫొటోలు వైరల్

సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం

కోబలి.. ఇది కదా కావాల్సింది రణబాలి

Updated Date - Oct 12 , 2026 | 12:08 PM

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!

నిన్న హ‌నుమాన్ అంశ్‌.. ఇప్పుడు ప్రేమ‌నే ఊరిలో! రికార్డుల ఊచ‌కోత‌

Anupama Paramwswaran: అప్పుడు సాయిపల్లవిని చంపాలనిపించింది..

హీరోయిన్ గా శ్రీకాంత్ కూతురు.. కొత్త క్రష్ వచ్చేసిందిరోయ్

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ యూట్యూబ్‌ ఛానల్‌ వారికోసమే..