Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ యూట్యూబ్‌ ఛానల్‌ వారికోసమే..

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:38 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

Salman khan

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ‘బీయింగ్‌ సల్మాన్‌ ఖాన్‌’ (Beling Salman khan) పేరుతో ప్రారంభించిన తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా చిన్నారులకు వినోదం పంచడం కోసం ఆయన ఛానల్ ను ప్రారంభించారు. సల్మాన్‌ యూట్యూబ్‌లోకి రావడం ఇది మొదటిసారి కాదు. 2020లో ‘సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ మ్యూజిక్‌’ పేరుతో ఓ ఛానల్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఛానల్‌కు దాదాపు 30 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అందులో ఆయన స్వయంగా ఆలపించిన ‘ప్యార్‌ కరోనా’, ‘తేరే బినా’ వంటి పాటలను విడుదల చేశారు.అయితే  తాజాగా ప్రారంభించిన ఛానెల్ ఉద్దేశం వేరు. ఇందులోని వీడియోలు పెద్దల కోసం కాదని, పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు.

“నా యూట్యూబ్‌ ఛానల్‌ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. అందులోని కంటెంట్‌ మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే అది మీ కోసం కాదు.. మీ ఇంట్లోని చిన్నపిల్లల కోసం మాత్రమే. వినోదం, ప్రేమ, కుటుంబ బంధాలతోపాటు పిల్లలకు విద్య కూడా ఎంతో అవసరం కదా” అంటూ సల్మాన్‌ పేర్కొన్నారు. మామూలుగా  సెలబ్రిటీల యూట్యూబ్‌ ఛానళ్లలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, సినిమా షూటింగ్‌ విశేషాల గురించి పోస్ట్లు చూస్తుంటాం. కానీ సల్మాన్‌ తన ఛానల్‌ను అందుకు భిన్నంగా  ఉంది. ఇందులో ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ పిల్లలకు నటనలోని ప్రాథమిక అంశాలను సరదాగా నేర్పిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ, హావభావాలు వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. సల్మాన్‌ ప్రస్తుతం ‘బిగ్‌బాస్‌ 20’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఆయన హోస్ట్‌గా వ్యవహరించడం 15వసారి. మరోవైపు అపూర్వ లాఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాతృభూమి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చిత్రాంగద సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు.  

Updated Date - Oct 11 , 2026 | 02:45 PM