కోబలి.. ఇది కదా కావాల్సింది రణబాలి

ABN , Publish Date - Oct 11 , 2026 | 06:45 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రణబాలి (Ranabaali).

Ranabaali

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రణబాలి (Ranabaali). మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. పెళ్లి తరువాత విజయ్ - రష్మిక నుంచి వస్తోన్న మొదటి చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, మేకర్స్ తాజాగా ఈ సినిమాలోని కోబాలి సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.


విడుదలైన క్షణం నుంచే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ప్రముఖ సంగీత దర్శకుల ద్వయం అజయ్ - అతుల్ అందించిన బాహుబలి స్థాయి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పవర్‌ఫుల్ ట్యూన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. 'రేగే ఉరుము దరువు మిన్ను ముట్టగా.. అష్టదిక్కులే పిక్కటిల్లగా, జోగే రేయ్యిలోన పగల సెగలిలా.. పొగులుతుండగా.. పగలు పుట్టదా' అంటూ సాగే ఈ శక్తివంతమైన గీతానికి కేశవాదిత్య అర్థవంతమైన సాహిత్యం అందించగా, వి.ఎం. మహాలింగం తన గళంతో ప్రాణం పోశాడు.


విజయ్ దేవరకొండ రగ్డ్ లుక్, సినిమా నేపథ్యానికి సరిగ్గా సరిపోయే విజువల్స్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ఈ సాంగ్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. మునుపెన్నడూ చూడని విజయ్ ని రాహుల్ ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. సాంగ్ వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ పాట చివర్లో కాకుండా మొదటే రిలీజ్ చేసి ఉంటే ఇంకా సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Oct 11 , 2026 | 06:45 PM