సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అసభ్యకరమైన వీడియోలు 72 గంటల్లో తొలగించాల్సిందే!

ABN, Publish Date - Oct 13 , 2026 | 09:43 AM

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు సంబంధించిన అశ్లీల ఏఐ కంటెంట్‌ను 72 గంటల్లో తొలగించాలని మెటాకు కోర్టు ఆదేశించింది. అభ్యంతరకర కంటెంట్ ఉన్న వెబ్‌సైట్ల యాక్సెస్‌ను నిలిపివేయాలని కేంద్ర శాఖలకు సూచించింది.

Kangana Ranaut

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. మెటాలో ఉన్న ఆమెకు సంబంధించిన అశ్లీల కంటెంట్ ను 72 గంటల్లో తొలగించాలని కోర్టు ఉత్తర్వులు జరీ చేసింది. కంగనా తరఫున న్యాయవాదులు చేసిన అభ్యర్థన మేరకు జస్టిస్‌ వికాస్ మహాజన్ ఈ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చారు. కంగనా పేరు, చిత్రం, పోలికలు, స్వరం, ప్రసంగాలు, వ్యక్తిత్వం, ఇతర వ్యక్తిగత గుర్తింపులను ఉపయోగించిన ఏ కంటెంట్ కూడా సోషల్ మీడియాలో ఉండటానికి అంగీకరించమని తెలిపారు. అయితే... కంగనాపై అభ్యంతరకరమైన వ్యంగ్య కంటెంట్‌, మీమ్స్ ఉన్నప్పటికీ తాము వాటిని తక్షణమే తొలగించాలని తాము కోరడం లేదని కంగనా తరఫున న్యాయ వాదులు కోర్టుకు చెప్పారు. కంగనాపై లైంగిక, అశ్లీల కంటెంట్ తో ప్రసారం అవుతున్న నకిలీ వార్తలను, ఆమె చెప్పని వ్యాఖ్యలను చెప్పినట్టుగా చూపించే ఏఐ ఆధారిత కంటెంట్‌పై మాత్రమే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.


వీరి వాదనలు విన్న హైకోర్టు అభ్యంతరకర కంటెంట్‌ ఉన్నట్లు గుర్తించిన వెబ్‌సైట్లకు సంబంధించిన యాక్సెస్‌ను నిలిపివేసేలా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు టెలికమ్యూనికేషన్స్‌ శాఖను ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని పేర్కొంది. కంగనా వంటి ప్రముఖ వ్యక్తికి ఉన్న హోదా, గుర్తింపు కారణంగా ఆమె వ్యక్తిత్వానికి, దానికి సంబంధించిన అంశాలకు ప్రత్యేక హక్కులు ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది. వాణిజ్య ప్రయోజనాల కోసం తన వ్యక్తిత్వాన్ని ఉపయోగించుకునే ప్రత్యేక హక్కుతో పాటు, అనుమతి లేకుండా వాటిని ఉపయోగించడం లేదా దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకునే హక్కు కూడా ఆమెకు ఉంటుందని పేర్కొంది. ఏఐ ద్వారా రూపొందించిన లేదా మార్పులు చేసిన చిత్రాలు, లైంగిక స్వభావం కలిగిన కంటెంట్‌, అసభ్యకర డీప్‌ఫేక్‌ల నుంచి కూడా కంగనాకు రక్షణ కల్పించడం ఈ ఉత్తర్వుల్లో భాగమని కోర్టు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

ఊటీలో ‘జనవరి 12 విడుదల’ టీమ్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలే

‘వారణాసి’లో రామాయణ ఘట్టంపై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

30 ఏళ్ల సినీ ప్రయాణం.. పవర్ స్టార్‌కు అల్లు అరవింద్ అభినందనలు

Updated Date - Oct 13 , 2026 | 09:49 AM