Singer Damini: సింగర్‌ దామిని బోల్డ్‌ స్టెప్‌.. తెలుగు మ్యూజిక్‌ ఇండస్ట్రీలో కొత్త చర్చ

ABN , Publish Date - Oct 12 , 2026 | 06:13 PM

ఇన్నాళ్లూ గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్‌తో కనిపించిన సింగర్ దామిని తాజాగా విడుదల చేసిన ‘సే యు వాంట్‌ మీ’ (Say you want me) మ్యూజిక్‌ వీడియోతో తనలోని మరో కోణాన్ని పరిచయం చేసింది.

‘బాహుబలి’లో పచ్చ బొట్టేసిన’ పాట విన్న ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు సింగర్‌ దామిని(Damini). ఆ పాటకు ముందు కొన్ని పాటలు పాడినా.. పచ్చబొట్టు పాటతోనే మంచి గుర్తింపు లభించింది. ఆ పాటతో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఈ రేంజ్‌లో ఏ పాట క్లిక్‌ కాలేదు. కొంత జర్నీ తర్వాత అవకాశాలు కూడా తగ్గాయి. దాంతో ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేయడం, బ్యాండ్స్‌లో పాడటం మొదటుపెట్టింది. వాటిలో ఇంగ్లిష్‌ పాటలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆమె సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి సంగీత ప్రియులను ఆశ్చర్యపరిచింది.

ఇన్నాళ్లూ గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్‌తో కనిపించిన ఆమె.. తాజాగా విడుదల చేసిన ‘సే యు వాంట్‌ మీ’ (Say you want me) మ్యూజిక్‌ వీడియోతో తనలోని మరో కోణాన్ని పరిచయం చేసింది. టూ పీస్‌ డ్రెస్‌, బోల్డ్‌ విజువల్స్‌, స్టైలిష్‌ ప్రెజెంటేషన్‌, పిచ్చేక్కించే ఎక్స్‌ప్రెషన్స్‌తో సాధారణ మ్యూజిక్‌ వీడియోలకు భిన్నంగా ఈ వీడియో ఉంది. హాలీవుడ్‌ పాప్‌ ఆల్బమ్స్‌ తరహా విజువల్‌ ట్రీట్‌ అందించే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది. తన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌తో హాట్‌హాట్‌గా దామిని కనిపించింది. ఆ పాటలోని బోల్డ్‌ థీమ్‌కు అనుగుణంగా ఆమె ఎంచుకున్న స్టైలింగ్‌, కాస్ట్యూమ్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

అసలు ఆమె చేసిన ఈ వీడియో థీమ్‌కు ఆమె ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటంటే... ‘‘ఒక మహిళ తన కోర్కెలు, ఆనందం, వ్యక్తిగత హద్దులు గురించి చెప్పే స్పైసీ సెక్సీల్‌ బోల్డ్‌ మ్యూజిక్‌ వీడియో ఇది. ఈ పాట మీ శరీరంపై, మీ కోరికలపై మీకే పూర్తి స్వేచ్ఛ, హక్కు ఉన్నాయనే భావనను కలిగిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఏకాంతంలో ఆస్వాదించడానికి ఇది మంచి పాట’' అని ఆమె వీడియో డిస్ర్కిప్షన్‌లో పేర్కొంది. అయితే ఇంత బోల్డ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ తెలుగు సింగర్స్‌లో ఎవరూ చేయలేదు. బాలీవుడ్‌ సింగర్స్‌తో జోనితా గాంధీ, నీతి మోహన్‌ లాంటి సింగర్స్‌ షోల్లో ఇంతగా ఎక్స్‌పోజ్‌ చేస్తుంటారు. కానీ తెలుగు సింగర్స్‌లో ఇంత బోల్డ్‌గా ఎవరూతెరపై కనిపించలేదు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. సింగర్‌గా ఎన్నో వేదికలపై సంప్రదాయంగా కనిపించిన దామిని ఒక్కసారిగా ఇలా ఎందుకు మారిపోయింది.. మ్యూజిక్‌ ఆల్బమ్‌ కోసమే అయిన ఇంత బోల్డ్‌నెస్‌ ఎందుకు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 12 , 2026 | 08:06 PM