మూడు ప్రాజెక్ట్‌లతో మెగా హీరో షాకివ్వబోతున్నాడా..
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:32 PM
తొలి చిత్రం ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత సరైన సక్సెస్ లేక కొంత వెనుకబడ్డారు. ఇప్పుడాయన మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది.
తొలి చిత్రం ‘ఉప్పెన’ (Uppena)తో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej).. ఆ తర్వాత సరైన సక్సెస్ లేక కొంత వెనుకబడ్డారు. ‘ఆదికేశవ’ తర్వాత దాదాపు మూడేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఆయన కెరీర్‌పై రకరకాల చర్చలు నడిచాయి. కంటెంట్‌పై గట్టి నమ్మకం కుదిరేవరకు ఏ సినిమా ఒప్పుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ సుదీర్ఘ గ్యాప్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. అయితే, ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ఒకేసారి ట్రిపుల్ ధమాకాతో పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన లైనప్‌లో ఏకంగా మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మహేష్ సూరపనేని ప్రాజెక్ట్
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వైష్ణవ్ తేజ్ ఓ చిత్రం చేయనున్నారు. ‘కథలో రాజకుమారి’ ఫేమ్ మహేష్ సూరపనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వైష్ణవ్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేసేలా కథ సిద్ధమైనట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
వి.ఐ. ఆనంద్ కాంబినేషన్‌లో సరికొత్త ప్రయోగం
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫాంటసీ, సస్పెన్స్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో వైష్ణవ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. వి.ఐ. ఆనంద్ మార్క్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో వైష్ణవ్ తేజ్ ఈసారి పూర్తి స్థాయి వైవిధ్యభరితమైన జానర్‌ను టచ్ చేయబోతున్నారని తెలుస్తోంది.
దిల్ రాజు బ్యానర్‌లో పరశురామ్ పెట్ల డైరెక్షన్
ఈ లైనప్‌లో అన్నింటికంటే హాట్ టాపిక్‌గా మారిన ప్రాజెక్ట్.. పరశురామ్ పెట్లతో చేయనున్న చిత్రం. ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో ఫ్యామిలీ, యూత్ పల్స్ పట్టుకున్న పరశురామ్.. వైష్ణవ్ తేజ్ కోసం ఓ సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను లాక్ చేశారట. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం.
కెరీర్ మళ్లీ గాడిలో పడినట్టేనా..
ఒకవైపు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్, మరోవైపు వైవిధ్యమైన కాన్సెప్ట్ చిత్రాలతో వైష్ణవ్ తేజ్ ఎంచుకున్న ఈ లైనప్ ఆయన కెరీర్‌కు సరైన బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ మూడు ప్రాజెక్ట్‌లలో రెండు సినిమాలు అనుకున్నట్లు హిట్టయినా.. మెగా మేనల్లుడి రేంజ్ మళ్లీ మారిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆయా నిర్మాణ సంస్థల నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ రావాల్సి ఉంది. అయితేనేం, వైష్ణవ్ తేజ్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు మాత్రం మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
అన్న కంటే భిన్నంగా.. పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం
‘రామాయణ’ న్యూ పోస్టర్ అదిరింది.. అడ్వాన్స్ బుకింగ్స్ అప్డేట్
సత్యదేవ్, ఫరియా ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ ప్రారంభం