మహా గాయక.. ఆశా భోంస్లే మృతిపై జయప్రద భావోద్వేగం
ABN, Publish Date - Apr 12 , 2026 | 05:11 PM
‘నాకే కాదు, ఆశా భోంస్లే మృతి వ్యక్తిగతంగా ప్రజలకు, అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. ఇండస్ట్రీ వారికి చెప్పలేని లోటు’ అని అన్నారు సీనియర్ నటీమణి జయప్రద. ఆశా భోంస్లే మృతి వార్త తెలిసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
‘నాకే కాదు, ఆశా భోంస్లే (Asha Bhosle) మృతి వ్యక్తిగతంగా ప్రజలకు, అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. ఇండస్ట్రీ వారికి చెప్పలేని లోటు’ అని అన్నారు సీనియర్ నటీమణి జయప్రద (Jaya Prada). ఆశా భోంస్లే మృతి వార్త తెలిసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. లతా మంగేష్కర్ (Lata Mangeshkar), ఆశా భోంస్లే.. వీళ్లిద్దరూ తనకిచ్చినటువంటి అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఆమె విడుదల చేసిన ఆడియో మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌లో..
‘‘ఆశా భోంస్లే గారు.. మధురమైన గానంతో ఎన్నో తరాలను అలరించారు. ఆమె స్వరం, ఆమె ప్రతిభ ఎప్పటికీ మన హృదయాల్లోనే నిలిచిపోయి ఉంటుంది. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు అమూల్యమైనవి. ఈరోజు చాలా దుఃఖమైన రోజు. అలాంటి మహా గాయక.. ఈరోజు మనతోటి లేకపోవడం అనేది నేను నమ్మలేకపోతున్నాను. అలాంటి మహానుభావురాలికి నేను హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఇస్తున్నాను. కానీ, ఆమె నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. ఎందుకంటే బాలీవుడ్‌లో ఆమె సంగీతంతో, ఆమె గొంతుతో, ఆమె స్వరంతో నాకిచ్చినటువంటి అమోఘమైనటువంటి పాటలు.. ‘శరాబీ’లో దే దే ప్యార్ దే కానీ, అలాగే ‘తోఫా తోఫా’ కానీ.. తెలుగులో ‘పాలు నీళ్లు’లో పాడిన ఆమె పాట.. అంటే ఆమెకున్నటువంటి ప్రతిభ ఎన్ని లాంగ్వేజెస్‌లోనైనా కూడా అద్భుతంగా సొంతం చేసుకుని పాడటం అనేది ఆమెలో ఉన్నటువంటి గుణం.
అలాగే లతా మంగేష్కర్ కానీ, ఆశా భోంస్లే దీదీ కానీ.. వీళ్లిద్దరూ నా జీవితంలో దేవిగా నాకిచ్చినటువంటి ఈ యొక్క అనుభూతిని నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది నాకే కాదు, వ్యక్తిగతంగా ఇది ప్రజలకు, అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. ఇండస్ట్రీ వారికి చెప్పలేని లోటిది. మళ్ళీ అలాంటి గాయక, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇక మనకు దొరకదేమో. అందుకే ఆమెకి హృదయపూర్వకంగా నా శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను’’ అని జయప్రద అంజలి ఘటించారు.
ఇవి కూడా చదవండి:
లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు
ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!
Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?
Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!
Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?