Asha Bhosle and Mumtaz: ముంతాజ్, ఆశా భోంస్లేల డ్యాన్స్ వీడియో వైరల్.. రెండు కళ్లు చాలడం లేదంటూ..

ABN , First Publish Date - 2023-12-05T21:52:58+05:30 IST

లెజెండ్స్ ముంతాజ్ మరియు ఆశా భోంస్లేల హార్ట్ టచ్ చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కోయి సెహ్రీ బాబు పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ముంతాజ్ 1960-70లలో చాలా సూపర్‌హిట్ చిత్రాలకు వర్క్ చేశారు. ఆశా భోంస్లే విషయానికి వస్తే.. ఆమె తన సుదీర్ఘ కెరీర్‌లో 12 వేలకు పైగా పాటలు పాడారు. ముంతాజ్, ఆశా భోంస్లేల ఈ డ్యాన్స్ వీడియో చూసి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోతోంది.

Asha Bhosle and Mumtaz: ముంతాజ్, ఆశా భోంస్లేల డ్యాన్స్ వీడియో వైరల్.. రెండు కళ్లు చాలడం లేదంటూ..
Asha Bhosle and Mumtaz

లెజెండ్స్ ముంతాజ్ (Mumtaz) మరియు ఆశా భోంస్లే (Asha Bhosle)ల హార్ట్ టచ్ చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ కోయి సెహ్రీ బాబు పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ముంతాజ్ 1960-70లలో చాలా సూపర్‌హిట్ చిత్రాలకు వర్క్ చేశారు. ఆశా భోంస్లే విషయానికి వస్తే.. ఆమె తన సుదీర్ఘ కెరీర్‌లో 12 వేలకు పైగా పాటలు పాడారు. ముంతాజ్, ఆశా భోంస్లేల ఈ డ్యాన్స్ వీడియో చూసి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు వారి ప్రేమను తెలియజేస్తూ కామెంట్స్ కురిపిస్తున్నారు.

ముంతాజ్ షేర్ చేసిన క్లిప్‌లో.. మొదట పాటకు ఆశా భోంస్లే చిన్నగా స్టెప్స్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ముంతాజ్ తనదైన స్టైల్‌లో డ్యాన్స్ స్టార్ట్ చేయగా.. ఆమెతో కలిసి ఆశా భోంస్లే కూడా ఫస్ట్ డ్యాన్స్ చేశారు. ముంతాజ్ ఓకే కానీ, ఆశానే ఇలా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ఎప్పుడూ ఆమె ఇలా డ్యాన్స్ చేసింది లేదు. ఈ వయసులో అదీ కూడా ముంతాజ్‌తో కలిసి స్టెప్స్ వేస్తుంటే.. చూడడానికి రెండు కళ్లు సరిపోలేదంటే నమ్మాలి. ఇదే విషయం నెటిజన్లు కూడా తమ కామెంట్స్‌తో తెలియజేస్తున్నారు.


ఈ వీడియోకి.. ‘వావ్...ముంతాజ్ జీ, బ్యూటిఫుల్, స్టిల్ సేమ్ ఎనర్జీ’, ‘ఓ మై గాడ్.. గౌరవనీయులైన ముంతాజీ... మీ డ్యాన్స్ మూమెంట్స్ చంపేస్తున్నాయి. ఈ వయసులో కూడా మీరు ఆ గ్రేస్ చూపిస్తున్నారంటే గ్రేట్.. మిమ్మల్ని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది.. మీరున్న కాలంలో ఉన్నందుకు మేము అదృష్టవంతులం’, ‘ఇది కలా.. నిజమా.. ఇంకా ఊహల్లోనే ఉన్నాం.. లెజెండ్స్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముంతాజ్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లోని అత్యుత్తమ నటీమణులలో ఆమె ఒకరు. 1958వ సంవత్సరంలో ‘సోనే కి చిదియా’ చిత్రంతో నటిగా ఆమె అరంగేట్రం చేశారు. అలాగే బాలీవుడ్‌ అత్యంత ప్రభావవంతమైన గాయకులలో ఆశా భోంస్లే ఒకరనే విషయం తెలియంది కాదు. ఆమె భారతరత్న లతా మంగేష్కర్ సోదరి అనే విషయం కూడా తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

====================

*Vishal: చెన్నై మేయర్‌పై విశాల్ సెటైర్లు.. ఘాటుగా స్పందించిన మేయర్

************************************

*Nithiin: ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం..

*************************************

*Neha Shetty: సుట్టంలా వచ్చి.. ఇష్టసఖిగా మారుతోంది

***************************************

Updated Date - 2023-12-05T21:52:59+05:30 IST