సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కామెడీ డ్రామాలో ఆమిర్ ఖాన్ వైఫ్‌గా ‘సాహో’ బ్యూటీ!

ABN, Publish Date - Apr 12 , 2026 | 06:34 PM

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సరసన ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ జోడీ కట్టబోతోందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్స్‌లోనూ ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Shraddha Kapoor and Aamir Khan

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) సరసన ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) జోడీ కట్టబోతోందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, బాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్స్‌లోనూ ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఒక ప్రముఖ వ్యాపారవేత్త జీవితం ఆధారంగా తెరకెక్కబోయే ఈ కామెడీ డ్రామాలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. ఇందులో ఆమిర్ ఖాన్‌కు భార్యగా శ్రద్ధా కపూర్ కనిపించనుందని టాక్. దర్శకుడు కమ్ ప్రొడ్యూసర్ రాహుల్ మోడీ (Rahul Mody) ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు సమాచారం.


ఆమిర్ ఖాన్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతోన్న విషయం తెలిసిందే. చివరిగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ సినిమాలో స్పెషల్ అప్పీరియెన్స్ ఇచ్చారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన, ఇలాంటి ఓ వైవిధ్యభరితమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమిర్ ఖాన్ అంటేనే విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన రొటీన్‌గా కాకుండా, ఎప్పుడూ తన సినిమాలలో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు కూడా జెన్‌z ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సరికొత్త కాన్సెప్ట్‌తో సిద్ధమవుతున్నారనేలా టాక్ వినిపిస్తోంది.


అయితే, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై అటు ఆమిర్ ఖాన్ కానీ, ఇటు శ్రద్ధా కపూర్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొంతకాలంగా ఆమిర్ ఖాన్ హీరోగా చేయడం లేదు కానీ, తన ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. ఇక శ్రద్ధా కపూర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె హిస్టారికల్ డ్రామా ‘ఈత’ (Eetha) షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. ఆమిర్, శ్రద్ధాల ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఇది కేవలం ఒక రూమర్‌గానే మిగిలిపోనుంది. మరి ఈ వెరైటీ కాంబినేషన్ వెండితెరపై నిజంగానే మెరుస్తుందో, లేదో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే మృతి.. ప్రముఖుల నివాళులు

ఎం.ఎస్. రాజు రూటు మార్చారు.. ఈసారి నో ఫీలింగ్స్!

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?

Updated Date - Apr 12 , 2026 | 06:34 PM