Aamir Khan: అవన్నీ రూమర్లే..!
ABN , Publish Date - Jul 22 , 2025 | 07:20 PM
ప్లాఫుల నుంచి బయటపడేందుకు ఆ స్టార్ హీరో ఊహించని స్కెచ్ వేస్తున్నాడా? సందేశాత్మక సినిమాలను పక్కనపెట్టి క్రైమ్ వైపు అడుగులు వేస్తున్నాడా? చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. పక్కా హిట్ కోసం.. ఆ హీరో వేస్తున్న ప్లాన్ ఏంటి.. అసలు ఇంతకీ ఎవరు ఆ హీరో..
ఈ మధ్యకాలంలో భార్యలు తమ భర్తలను హత్య చేయిస్తున్న క్రైమ్ కథలు దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన ఒక జంట విషయంలో జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. మామూలుగా ఇలాంటి సంఘటనలను మేకర్స్ వెంటనే పట్టుకొని సినిమాలుగా తీస్తుంటారు. అలా ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్ ఈ హత్య కేసు ఆధారంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) చిత్రాలు ఈ మధ్య ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమై.. అతడి కెరీర్‌లో పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన 'సితారే జమీన్ పర్' (Sitaare Zameen Par) మంచి సమీక్షలు పొందినప్పటికీ, కలెక్షన్లు మామూలుగానే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో అమీర్ ఒక భారీ సాలిడ్ హిట్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. విశ్రాంతి లేకుండా వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం... మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఆధారంగా అమీర్ ఒక ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మేఘాలయ హనీమూన్ కేసులో కొత్తగా వివాహమైన రాజా రఘువంశీ హత్యకు గురికావడం, అతడి భార్య సోనమ్‌పై ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులోని ఊహించని ట్విస్ట్‌లు, ఉత్కంఠ అమీర్‌ను ఆకర్షించాయని... అతడు ఈ కథను తెరపై ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తున్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై అమీర్ టీమ్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. అలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్న మాటలు కూడా ఆ టీమ్ నుంచి వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also: Pawan Kalyan: తూతూమంత్రంగా చేస్తాడనిపించుకోకూడదనే కష్టపడ్డా..
Read Also: Anasuya: పెద్ది డైరెక్టర్ బుచ్చి.. నన్ను అలా పిలవమనేవాడు