సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుండి మరో గీతం!

ABN, Publish Date - Oct 30 , 2025 | 06:41 PM

నేషనల్ క్రష్ రష్మికా మందణ్ణ (Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి (Deekishith Shetty) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend). రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో థర్డ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'లాయీ లే...' అంటూ సాగే ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వర పర్చగా, రాకేందు మౌళి రాశారు. దీన్ని కపిల్ కపిలన్ అద్భుతంగా పాడారు. అమాయకురాలైన అమ్మాయిని తెలివిగా ఎర వేసే ఉచ్చులోకి లాగే కపట ప్రేమికులు ఉంటారని ఈ పాట ద్వారా చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఈ పాటలో హీరో మనస్తత్త్వాన్ని అన్యోపదేశంగా చెప్పారు. దాంతో హీరో, హీరోయిన్ల మధ్య ఉండే బంధాలు ఎలా ఉంటాయనే విషయంలో ఆడియెన్స కు అవగాహన ఏర్పడుతుంది.

Updated Date - Oct 30 , 2025 | 06:41 PM