The Girlfriend: ఏం జరుగుతోంది ప్రోమో.. మరో చార్ట్ బస్టర్ లోడింగ్
ABN , Publish Date - Aug 25 , 2025 | 06:00 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస సినిమలతోనే కాదు.. వరుస విజయాలతో కూడా దూసుకుపోతుంది. గత కొన్నేళ్లుగా అమ్మడు ఏది పట్టినా బంగారమే అవుతుంది.
The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస సినిమలతోనే కాదు.. వరుస విజయాలతో కూడా దూసుకుపోతుంది. గత కొన్నేళ్లుగా అమ్మడు ఏది పట్టినా బంగారమే అవుతుంది. ఇక ఇప్పటివరకు హీరోల సరసన నటించిన ఈ చిన్నది ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందకు రానుంది. అందాల రాక్షసి సినిమాతో హీరోగామంచి పేరు తెచ్చుకొని ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)చిలసౌతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.
ఇక ఇలాంటి హిట్ తరువాత రాహుల్.. అక్కినేని నాగార్జునతో మన్మధుడు 2 తీసి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు మైక్ ముట్టని రాహుల్ ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. ఏం జరుగుతోంది అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సాంగ్ వింటుంటే ఇది కచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుంది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అన్నీ భాషల్లో ఈ సాంగ్ ను చిన్మయినే పాడడం విశేషం. ఇక వీడియోను బట్టి ఇదొక ప్రేమ గీతంలా కనిపిస్తుంది. రష్మిక, దీక్షిత్ మధ్య ఉండే ప్రేమ భావాలను ఎంతో అద్బుతంగా చూపించారు. రష్మిక అందం, చిన్మయి వాయిస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. హేషమ్ అబ్ధుల్ వాహబ్ మరోసారి తన క్లాస్ మ్యూజిక్ తో ప్రేక్షకుల హృదయాలను దోచేయనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రంతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Bunny Vas - Allu Arjun: నేనేమీ మాట్లాడలేను.. ఏదైనా వాళ్లే చెప్పాలి..
OG Movie: టైమ్ లేదు గంభీర.. ప్రమోషన్స్ మొదలెట్టు