The Girl Friend: ది గర్ల్ ఫ్రెండ్‌లో.. కీలక పాత్ర! నా వళ్ల కాదన్న.. సందీప్ రెడ్డి వంగా
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:28 PM
రశ్మిక మందణ్ణ హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇందులో ఓ కీలక పాత్రను సందీప్ రెడ్డి వంగతో చేయించాలనుకున్నానని ఆయన అంగీకరించక పోవడంతో తానే చేశానని రాహుల్ చెబుతున్నాడు.
నేషనల్ క్రష్ రశ్మికా మందణ్ణ (Rashmika Mandanna) నటించిన హిందీ మూవీ 'థామా' (Thaama) వంద కోట్ల క్లబ్ లో చేరింది. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ నుండి ఇటీవల కాలంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల సరసన ఇది చేరకపోయినా... రశ్మిక అభిమానులు మాత్రం ఆమె పోషించిన బేతాళురాలి పాత్ర కొత్తగా ఉందని ఆనందిస్తున్నారు. ఇదిలా ఉంటే... రశ్మిక నటించిన మరో చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girl Friend) నవంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో జనం ముందుకు రాబోతోంది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించారు. నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓ కీలక పాత్రను చేయమని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగను అడిగారట.
ఈ విషయం గురించి దర్శకుడు రాహుల్ ఇటీవల మాట్లాడుతూ, 'ఈ సినిమాలో అతిథి పాత్రను మించిన ఓ కీలకమైన పాత్ర ఒకటి ఉంది. అది సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) చేస్తే కొత్తగా ఉంటుందనిపించింది. ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడని నా నమ్మకం. అదే ధైర్యంతో ఆయన్ని అప్రోచ్ అయ్యాను. అయితే సందీప్ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. అతిథి పాత్రలో సరదాగా ఒకటి రెండు సీన్స్ అంటే ఓకే కానీ... నాలుగైదు సీన్స్ చేయడం కష్టమే' అని చెప్పేశాడట. దాంతో రాహుల్ రవీంద్రన్ ఆ పాత్ర చేయమని ప్రముఖ నటుడు 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) ను కోరాడట. ఎందుకంటే... 'వెన్నెల' కిశోర్, రాహుల్ రవీంద్రన్ మధ్య మంచి స్నేహం ఉంది. మాములూ గా అయితే రాహుల్ రవీంద్రన్ మాటను 'వెన్నెల' కిశోర్ ఎప్పుడూ కాదని చెప్పడు. కానీ ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, కమెడియన్ ఇమేజ్ ఉన్న తాను అలాంటి సీరియస్ పాత్ర చేస్తే జనం యాక్సెప్ట్ చేయరని కిశోర్ స్పష్టం చేశాడట. దాంతో ఇక గత్యంతరం లేక తానే ఆ పాత్రను చేశానని రాహుల్ తెలిపాడు. ఇటీవల వచ్చిన 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ లో రాహుల్ రవీంద్రన్ కనిపించాడు కూడా! నిజానికి తాను మల్టిపుల్ టాస్క్స్ చేయలేనని, అందుకే దర్శకత్వం, నటన ఒకేసారి చేయడం ఇష్టముండేది కాదని రాహుల్ రవీంద్రన్ తెలిపాడు. తాను గతంలో దర్శకత్వం వహించిన 'చి.లా.సౌ.', 'మన్మధుడు -2' చిత్రాలలో అందుకే నటించలేదని తెలిపాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ పాత్ర చేయకతప్పలేదని అన్నాడు.
నిజానికి రాహుల్ ఫస్ట్ ఛాయిస్ అయిన సందీప్ రెడ్డి వంగా ఈ పాత్రను చేసి ఉంటే... సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అయ్యి ఉండేది. ఎందుకంటే... 'పుష్ప' (Pushpa) సినిమా తర్వాత హిందీలో రష్మికా మందణ్ణకు మళ్ళీ ఆ రేంజ్ హిట్ ఇచ్చిన సినిమా 'యానిమల్' (Animal). దాని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, రశ్మిక స్క్రీన్ షేర్ చేసుకుని ఉంటే... ఖచ్చితంగా అది ఉత్తరాది ఆడియెన్స్ లోనూ క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఉండేది. మరి ఇప్పుడు నట దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేసిన పాత్ర ఏమేరకు మూవీకి హెల్ప్ అవుతుందో చూడాలి.
Also Read: GD Naidu: మరో బయోపిక్ లో మాధవన్...
Also Read: Premaledhani: లక్ష్మణ్ టేకుముడి బ్రో.. ఇంత షాకిచ్చావేంటి! ‘ప్రేమ లేదని’ టీజర్