The Girlfriend: దీక్షిత్ తో రష్మిక ఘాటు రొమాన్స్.. నదివే ప్రోమో చూశారా

ABN , Publish Date - Jul 15 , 2025 | 10:46 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. అమ్మడి లక్ ఏ రేంజ్ లో ఉంది అంటే ఈమధ్యకాలంలో ఆమె పట్టిందల్లా బంగారంగా మారుతుంది.

The Girlfriend

The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. అమ్మడి లక్ ఏ రేంజ్ లో ఉంది అంటే ఈమధ్యకాలంలో ఆమె పట్టిందల్లా బంగారంగా మారుతుంది. పుష్ప 2, ఛావా, కుబేర... ఇలా ఆమె నటించిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు వంద కోట్ల క్లబ్ లో కూడా చేరాయి. దీంతో రష్మిక ఇండస్ట్రీ లక్కీ హీరోయిన్ గా మారింది. ఈ సినిమాల తరువాత ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే.


ప్రస్తుతం రష్మిక నటిస్తున్న చిత్రాల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఒకటి. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిలసౌ సినిమాతో రాహుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన రిజల్ట్ తరువాత డైరెక్షన్ కు దూరమైన రాహుల్ చాలా గ్యాప్ తరువాత లేడీ ఓరియెంటెడ్ కథతో రాబోతున్నాడు.


రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో దీక్షిత్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. నదివే.. నువ్వు నదివే అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ లో రష్మిక, దీక్షిత్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. జూలై 16 న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. రాకేందు మౌళి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ కు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Meher Ramesh: పవన్ తో సినిమా.. జనాల్ని చంపేస్తావా

Vidya Balan: డర్టీ పిక్చర్ భామ.. ఇంకా అంతే ఘాటుగా చూపిస్తుందే

Updated Date - Jul 15 , 2025 | 10:46 PM