Bun Butter Jam Movie: తెలుగులోనూ వస్తున్న 'బన్ బటర్ జామ్’
ABN , Publish Date - Aug 06 , 2025 | 07:47 PM
టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. పరభాష చిత్రాలైన సరే కథ కనెక్ట్ అయితే చాలు సక్సెస్ చేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మరో సినిమా అలా సత్తా చాటేందుకు వస్తోంది.
ఒక భాషలో సక్సెస్ సాధించిన మూవీని మరో భాషలోకి డబ్ చేయడం కామన్ గా మారింది. కంటెంట్ నచ్చితే చాలు స్టార్ క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా బ్రహ్మారథం పడుతున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే అలా వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ ను అందుకోగా... తాజాగా మరో చిత్రం సందడి చేయడానికి వచ్చేస్తోంది. అదే ‘బన్ బటర్ జామ్’ (Bun Butter Jam) .
రాజు జయమోహన్ (Raju Jeyamohan), ఆధ్య ప్రసాద్ (Aadya Prasad) , భవ్య త్రిఖ (Bhavya Trikha) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బన్ బటర్ జామ్’. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా తమిళ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పైన సిహెచ్. సతీష్ కుమార్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఫన్ రైడ్ గా సాగింది. తెలుగు ప్రేక్షకులకు సైతం నచ్చే అంశాలు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది.
ట్రైలర్ విషయానికి వస్తే...‘సంపాదించిన దానిలో కొంచెం పెళ్లికి ఖర్చు పెడుతున్నారు... మిగతాది డైవర్స్‌కి ఖర్చు పెడుతున్నారు' అంటూ సాగే డైలాగ్స్ తో మొదలైన ట్రైలర్ మొదలైంది. తల్లి దండ్రుల ప్రేమతో పాటు హీరో క్యారెక్టర్ ను సరదాగా ప్రెజెంట్ చేశారు. వధూవరుల ఇద్దరు తల్లులు అరెంజ్డ్ మ్యారేజ్ గురించి ఎలా ఆలోచిస్తారనే పాయింట్ ఈ కథలో కొత్తగా చూపించడంతో పాటు హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్‌ను అందంగా చూపించారు. కాలేజ్ లైఫ్, ప్రేమ, పెళ్లి తో పాటు తల్లిదండ్రుల ప్రేమను చక్కగా చూపించిన ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉండబోతోన్నాయో అర్థం అవుతోంది.
నేటి యువతకు ప్రేమ, పెళ్లి, రిలేషన్స్ విషయంలో ఉండే ఆలోచనా విధానాన్ని ప్రధానాంశంగా చేసుకొని రాసుకొన్న కథగా ‘బన్ బటర్ జామ్’ రూపుదిద్దుకుంది. రాఘవ్ మిర్‌దత్ ఫన్నీగా ఈ సినిమాను తెరకెక్కించాడు. నివాస్ కె. ప్రసన్న సంగీతం, బాబు కుమార్ సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ వేల్యూస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్ట్ ప్రమోషన్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచిన ఈ మూవీ ఆగస్ట్ 22న రిలీజ్ కానుంది. మరి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
Read Also: 120 Bahadur Teaser: దేశభక్తిని రగిలించేలా '120 బహదూర్' టీజర్
Read Also: Chiranjeevi - Anil Ravipudi: అదిదా సర్ ప్రైజ్ అనేలా మెగా సర్ ప్రైజ్