120 Bahadur Teaser: దేశభక్తిని రగిలించేలా '120 బహదూర్' టీజర్
ABN , Publish Date - Aug 06 , 2025 | 06:28 PM
బి టౌన్ మరో హిట్టును ముందే ఖరారు చేసుకుంటోందా!? టీజర్ తోనే బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాం అన్న హింట్ ను ఇచ్చేసినట్టేనా!? తాజాగా విడుదలైన '120 బహదూర్' మూవీ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడమే కాదు పక్కా బ్లాక్ బస్టర్ అన్న ఫీల్ కలుగుతోంది.
బాలీవుడ్‌లో ఇటీవల దేశభక్తి సినిమాలు జోరుగా వస్తున్నాయి. ఈ పేట్రియాటిక్ వైబ్ తో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే మేకర్స్ కూడా ఈ జోనర్‌లో సినిమాలు తెగ తీస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో మరో పవర్‌ఫుల్ పేట్రియాటిక్ డ్రామా రాబోతోంది. అదే '120 బహదూర్'. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ కాగా సోషల్ మీడియాలో దీనికి విశేష స్పందన లభిస్తోంది.
'120 బహదూర్' లో ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్ చేస్తున్నాడు. 1962లో జరిగిన బాటిల్ ఆఫ్ రెజాంగ్ లా... ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పరమ వీర చక్ర అవార్డ్ గ్రహీత మేజర్ షైతాన్ సింగ్ భాటి రోల్‌కు ఫర్హాన్ అక్తర్ జీవం పోశాడు. ఆద్యంతం ఎమోషన్స్‌ని క్యారీ చేస్తున్న ఈ టీజర్ ను చూసి అందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. చైనా సరిహద్దుల్లోని యుద్ధ భూమిలోని పోరాట దృశ్యాలు... డైలాగ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.
'హమ్ పీఛే నహీ హఠేంగే' అన్న డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. టోటల్ టీజర్ సినిమాటిక్ వైబ్ లో అట్రాక్ట్ చేస్తోంది. భారతీయ సైనికులు శత్రు సైన్యంతో ఎలా పోరాడారో, వాళ్ల ధైర్యాన్ని ఈ మూవీ సూపర్ ఇంటెన్స్‌గా చూపిస్తోంది. ఈ మూవీలో ఫర్హాన్ అక్తర్‌తో పాటు రాశి ఖన్నా, ధన్వీర్ సింగ్, సాహిబ్ వర్మ, స్పర్షావాలియా, అశుతోష్ శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రజనీష్ ఘయ్ ఈ సినిమాను రూపొందించారు. ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ, అమిత్ చంద్ర నిర్మించిన ఈ సినిమా నవంబర్ 21న థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. మరి బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా ఈ రేంజ్ లో దుమ్ము రేపుతుందో చూడాలి మరి.