scorecardresearch

Kollywood Directors: రామ్‌చరణ్‌ ఎందుకు కలిశారంటే...

ABN , First Publish Date - 2023-08-18T14:56:03+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిసున్నారు గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌. తాజాగా ఆయన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌ను కలిశారు. వారితో రాసేపు ముచ్చటించారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Kollywood Directors: రామ్‌చరణ్‌ ఎందుకు కలిశారంటే...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రంలో నటిసున్నారు గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram charan) . తాజాగా ఆయన కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌ను (Kollywood directors) కలిశారు. వారితో రాసేపు ముచ్చటించారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గురువారం దర్శకుడు శంకర్‌ 60వ పుట్టినరోజు సందర్భంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులకు శంకర్‌ పార్టీ ఇచ్చారు. చెన్నై వేదికగా జరిగిన ఈ వేడుకల్లో రామ్‌చరణ్‌, విక్రమ్‌, తమన్‌, లోకేశ్‌ కనగరాజ్‌, వెట్రిమారన్‌, విఘ్నేశ్‌ శివన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, లింగుస్వామి, గోపీచంద్‌ మలినేని తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చరణ్‌ కోలీవుడ్‌ ప్రముఖులతో సరదాగా మాట్లాడారు.

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికొస్తే.. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. శంకర్‌-కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రమిది. దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శంకర్‌ ‘ఇండియన్‌-2’ చిత్రంతో బిజీగా ఉండడం, రామ్‌చరణ్‌ తండ్రి కావడంతో షూటింగ్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. త్వరలో తాజాగా షెడ్యూల్‌ మొదలుకానుందని తెలుస్తోంది.

జనవరి నుంచి బుచ్చిబాబు సినిమా

శంకర్‌ చిత్రం పూర్తయిన వెంటనే రామ్‌చరణ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కించే చిత్రం మొదలు కానుంది. మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదొక మంచిలాంటి కథ అనీ, తన గత సూపర్‌హిట్‌ చిత్రాలతో కంపేర్‌ చేస్తే కెరీర్‌కు ప్రత్యేకంగా నిలిచే చిత్రమిదని రామ్‌చరణ్‌ పలు సందర్భాల్లో చెప్పారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కావాలి. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్‌ మొదలుకానుందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Updated Date - 2023-08-18T14:56:03+05:30 IST