Chiranjeevi - Anil Ravipudi: అదిదా సర్ ప్రైజ్ అనేలా మెగా సర్ ప్రైజ్
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:03 PM
మెగా సర్‌ప్రైజ్ వచ్చేస్తోంది. ఒకదాని కోసం వెయిట్ చేస్తోంటే.. మరో గిఫ్ట్‌తో అభిమానులను ఖుషీ చేయబోతున్నాడు చిరు. ఈ గిఫ్ట్‌ను ఇస్తోంది మరెవరో కాదు... ట్రెండ్ కు తగ్గ ప్రమోషన్‌తో దుమ్మురేపే యంగ్ డైరెక్టర్. దీంతో ఇప్పటి నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఇంతకీ ఆ గిఫ్ట్ కథేంటి..
చిరంజీవి (Chiranjeevi )... ఈ పేరులోనే ఓ క్రేజ్, ఓ వైబ్రేషన్ ఉంది. ఆరు దశాబ్దాల వయసులోనూ ఆయనలోని ఎనర్జీని చూసి కుర్ర హీరోలే కుళ్లుకుంటారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్, దీనితో పాటు టాలీవుడ్ స్టార్ మేకర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ తో సాగుతోంది. అనిల్ రావిపూడి తన సిగ్నేచర్ స్పీడ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ... చిరంజీవిని సైతం ఆకట్టుకుంటున్నారు. అయితే సినిమా సెట్స్ పై ఉండగానే తనదైన శైలిలో ప్రమోషన్ షురూ చేసే అనిల్.. చిరు సినిమాకు అదిరిపోయే స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అనిల్ రావిపూడి సినిమాలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార (Nayanthara) నటిస్తోంది. తాజాగా కేరళలో వీరిపై ఓ రొమాంటిక్ డ్యూయెట్‌ను చిత్రీకరించారు. ఆ సాంగ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సైతం లీక్ అయ్యాయి. వాటిని చూస్తే... ఈ పాటలో చిరంజీవి స్టైలిష్ లుక్, నయనతార గ్లామర్ లుక్ కలిసి సినిమా స్క్రీన్‌పై మాయాజాలం చేయనున్నారని అర్థమవుతోంది. అయితే ఈ సాంగ్ గ్లింప్స్ ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసి.. అభిమానులకు గ్రాండ్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఈ సాంగ్ గ్లింప్స్ సోషల్ మీడియాలో తుఫాను సృష్టించడం ఖాయమని అంటున్నారు.
మరోవైపు అనిల్ రావిపూడి ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి లాంటి లెజెండ్‌తో పనిచేస్తుండటంతో.. తన డైరెక్టోరియల్ మ్యాజిక్‌ను చూపించేందుకు కష్టపడుతున్నాడు. సినిమా కథ, స్క్రీన్‌ప్లే, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ లను అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా అందించేందుకు రెడీ అవుతున్నాడట అనిల్. మొత్తానికి ఆగస్టు 22న బర్త్‌డే స్పెషల్ సాంగ్‌తో మొదలు వరుస అప్డేట్స్ తో అభిమానులను ఖుషీ చేయబోతున్నాడు.
Read Also: Vijay Devarakonda: ఆ యాప్స్ లీగల్.. అందుకే ప్రమోట్ చేశా
Read Also: Pushpa Stampede: అల్లు అర్జున్ పుష్ప 2 తొక్కిసలాట.. NHRC సీరియస్