Kollywood: ఆ ముగ్గురు నటులకు కోలీవుడ్ ఘన నివాళి
ABN , First Publish Date - 2023-05-16T15:32:30+05:30 IST
ఈ యేడాదిలో ఇప్పటివరకు వివిధ అనారోగ్య సమస్యలతో తిరిగిరాని లోకాలకు చేరుకున్న సినీ నటులకు కోలీవుడ్ పరిశ్రమ నివాళులర్పించింది
 
                                    
ఈ యేడాదిలో ఇప్పటివరకు వివిధ అనారోగ్య సమస్యలతో తిరిగిరాని లోకాలకు చేరుకున్న సినీ నటులు మయిల్సామి (Mayilsamy), టీపీ గజేంద్రన్ (T. P. Gajendran), మనోబాలా (Manobala)కు తమిళ చిత్ర పరిశ్రమ (Kollywood) ఘన నివాళి అర్పించింది. స్థానిక టి.నగర్‌లోని సర్ త్యాగరాయశెట్టి హాలులో తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్, కోశాధికారి హీరో కార్తీ (Karthi), నిర్మాత టి.శివ, ఫిల్మ్ సిటీ చైర్మన్ నటుడు రాజేష్, ఫెఫ్సీ ఉపాధ్యక్షుడు స్వామినాథన్, తమిళ నిర్మాతల మండలి కోశాధికారి రాధాకృష్ణన్, నటీమణులు సచ్చు, రోహిణి, దేవయాని, నటులు శరవణన్, పశుపతి, అజయ్రత్నం, మన్సూర్ అలీఖాన్, ఎం.ఏ.ప్రకాష్, దళపతి దినేష్, శ్రీమాన్, వాసుదేవన్, హేమచంద్రన్, విఘ్నేష్, ఉదయ, దర్శకులు ఆర్.వి.ఉదయకుమార్, లియాఖత్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా మనోబాలా, మయిల్సామి, గజేంద్రన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. (Kollywood Tributes to Mayilsamy, TP Gajendran and Manobala)

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ.. ఈ ముగ్గురు నటులు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించారు. టీపీ గజేంద్రన్ ఎల్లవేళలా పాజిటివ్ గుణం కలిగిన వ్యక్తి. మయిల్సామి (Mayilsamy)తో కలిసి ‘చిరుత్తై’ సినిమాలో కలిసి నటించా. ఒక వ్యక్తి తనకు మించివున్న సంపదను దానం చేయాలని చెపుతుంటారు. కానీ, మయిల్సామి అప్పు తీసుకుని దాన ధర్మాలు చేశారు. తన కోసం ఏదీ అడగలేదు. ఎవరికైన సాయం చేయడానికి మాత్రమే ఆయన నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. ఎంజీఆర్ (MGR) సిద్ధాంతాలను తూ.చ. తప్పకుండా పాటించిన వ్యక్తి.
 
 
ఇక మనోబాలా (Manobala) విషయానికి వస్తే.. అనేక మంచి కార్యక్రమాల్లో తనకు తానుగా బాధ్యత తీసుకుంటారు. ఒక సమస్య పెద్దదిగా మారుతుందని తెలిస్తే చాలు.. ఆ రోజు రాత్రికే దాని సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారు. ప్రతి ఒక్కరితో స్నేహ సంబంధాలు కలిగిన వ్యక్తి. ముగ్గురు మంచి వ్యక్తులు దూరం కావడం వ్యక్తిగతంగానే కాకుండా, చిత్ర పరిశ్రమకు కూడా తీరని లోటు.. అని అన్నారు.

ఇవి కూడా చదవండి:
************************************************
*Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?
*Tiger Nageswara Rao: ఫస్ట్ లుక్‌కి డేట్ ఫిక్సయింది.. ఈ సారి వేట మామూలుగా ఉండదట!
*Anasuya: రంగమ్మత్త కాదు.. సుమతిగా బోల్డ్ క్యారెక్టర్లో!
*Spy Teaser: ‘కార్తికేయ 2’ని మించి.. నిఖిల్ మరో సాహసం చేస్తున్నాడు
*AadiKeshava Glimpse: పంజా వైష్ణవ్ తేజ్ ఉగ్రరూపం