Kollywood: 2022లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీరే..

ABN , First Publish Date - 2022-12-27T19:30:28+05:30 IST

2022 సంవత్సరంలో తమిళ చిత్రపరిశ్రమకు (Kollywood) పలువురు హీరోయిన్లు పరిచయమయ్యారు. అయితే, వీరు నటించిన చిత్రాలు విజయవంతం కాలేదు. వీరిలో...

Kollywood: 2022లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీరే..
Heroines

2022 సంవత్సరంలో తమిళ చిత్రపరిశ్రమకు (Kollywood) పలువురు హీరోయిన్లు పరిచయమయ్యారు. అయితే, వీరు నటించిన చిత్రాలు విజయవంతం కాలేదు. వీరిలో ఒకరిద్దరు మినహా.. పెద్దగా పాపులర్‌ కూడా కాలేకపోయారు. ఇలాంటివారిలో కృతిశెట్టి, అదితి శంకర్‌, శ్రీనిధి షెట్టి, సిద్ధి ఇద్నానీ, మృణాల్ ఠాకూర్ వంటివారు ఉన్నారు. వీరి వివరాలను ఓసారి పరిశీలిస్తే...

Krithi-Shetty.jpg

కృతిశెట్టి (Krithi Shetty)

తెలుగులో ‘ఉప్పెన’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె... తమిళంలో ‘ది వారియర్‌’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇది పెద్దగా సక్సెస్‌ కాలేదు. అయితే, ఈ చిత్రంలోని ‘బుల్లెట్‌ సాంగ్‌’ పాట సూపర్‌ హిట్‌ అయింది. ఈ పాటలో ఆమె పాపులర్‌ అయ్యారు. ఇపుడు బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘వణంగాన్‌’ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నుంచి హీరో సూర్య తప్పుకున్నారనేలా వార్తలు వినిపిస్తున్నాయి.

Aditi-Shankar.jpg

అదితి శంకర్‌ (Aditi Shankar)

స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ కుమార్తె అదితి శంకర్‌... ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ‘విరుమన్‌’ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈ చిత్రం ద్వారా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. కానీ, ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఆమె చేసిన కామెంట్స్‌, జోకులతో పెద్ద పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌ నటిస్తున్న ‘మావీరన్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Srinidhi.jpg

శ్రీనిధి షెట్టి (Srinidhi Shetty)

‘కేజీఎఫ్‌’ ఫేం కన్నడ వెండితెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ చియాన్‌ విక్రమ్‌ నటించిన ‘కోబ్రా’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆమెకు ఆశించిన స్థాయిలో పేరు తెచ్చిపెట్టలేదు. ఇందులో హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో శ్రీనిధి షెట్టి.. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారనే విషయం చాలా మందికి తెలియదు.

Siddhi.jpg

సిద్ధి ఇద్నానీ (Siddhi Idnani)

శింబు హీరోగా నటించిన ‘వెందు తణిందదు కాడు’ అనే చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సిద్ధి ఇద్నానీ... ఈ మూవీలో ప్రేమ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి, ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్య సరసన ఒక చిత్రంలో నటిస్తున్నారు.

Sobhitha.jpg

వీరు కాకుండా.. ‘కాఫీ విత్ కాదల్’ చిత్రంతో మాళవికా శర్మ (Malvika Sharma), ‘ప్రిన్స్’ చిత్రంతో మారియా ర్యాబోషప్క (Maria Ryaboshapka), ‘నానే వరువేన్’ చిత్రంతో ఎల్లీ అవ్రామ్ (Elli Avram), ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంతో శోభితా ధూళిపాల (Sobhita Dhulipala), ‘సీతా రామం’ చిత్రంతో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. ఇంకా డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh) వంటి వారంతా కోలీవుడ్‌లో అరంగేట్రం చేశారు.

Updated Date - 2022-12-27T19:50:12+05:30 IST