Mirai: మిరాయ్.. వైబ్ ఉందిలే బేబీ సాంగ్ ప్రోమో
ABN , Publish Date - Jul 24 , 2025 | 06:15 PM
తేజ సజ్జా కథానాయకుడిగా వస్తోన్న ‘మిరాయ్’ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా వైబ్ ఉంది అంటూ పాట ప్రోమో విడుదల చేశారు.
తేజ సజ్జా (Teja sajja) కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’ (mirai). 'హనుమాన్' వంటి భారీ విజయం తర్వాత తేజ సజ్జా నటిస్తున్న చిత్రమిది. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ కథానాయిక. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రియ, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రధారులు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబరులో ఈ సినిమా ప్రేఓకుల ఎదుటకు రానుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓపాటకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వైబ్ ఉందిలే బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబ్‌ను ఊపే వైబుందిలే అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటను సినిమా హీరో హీరోయున్లపై పోలంకి విజయ్ నృత్య దర్శకత్వంలో తెరకెక్కించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించగా హనుమాన్ ఫేమ గౌర హారి సంగీతం సమకూర్చారు. పూర్తి పాటను జూలై 26 (శని వారం) రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.