సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Venkatesh: శంకరవర ప్రసాద్‌ని వెంకీ కలిసేది ఎప్పుడంటే..

ABN, Publish Date - Aug 30 , 2025 | 12:48 PM

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రంతో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

Chiranjeevi - Venkatesh


అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ (Mana Shankaravaraprasad Garu) చిత్రంతో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). ఆయన టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రమిది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. నయనతార కథానాయిక. విక్టరీ వెంకటేశ్‌ ఇందులో ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అనిల్‌ అధికారికంగా ప్రకటించారు. చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మెగా బ్లాస్ట్‌ గ్లింప్స్‌కు వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అయితే ఆయన వచ్చే నెలలో సెట్స్‌లో అడుగు పెట్టబోతున్నారట. త్వరలో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలుకానుంది.

దీని కోసం ఇప్పటికే ప్లానింగ్‌ అంతా పూర్తయింది. ఈ చిత్రంలో వెంకటేశ్‌ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని అనిల్‌ ఇప్పటికే చెప్పారు.  చిరంజీవితోపాటు ఓ పాట, యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ వెంకీ భాగమయ్యే అవకాశం ఉందని కొద్దిరోజులుగా టాక్‌ నడుస్తోంది. మరి ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటూ కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఫ్యామిలీ, వినోదం, యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చిరు చాలా స్టైలిష్‌గా కనిపించబోతున్నారని ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌తో అర్థమైంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. 

 ALSO READ: Kenisha: రవి మోహన్‌ ప్రతిభ ప్రపంచానికి తెలియాలి

Joy Crizildaa: గర్భిణిని చేసి మోసం చేశాడు..

Vishal - Dhansika: పెళ్లి ఆలస్యం ఎందుకంటే.. ధన్సిక కూడా సై అంది

Updated Date - Aug 30 , 2025 | 12:49 PM