Joy Crizildaa: గర్భిణిని చేసి మోసం చేశాడు..
ABN , Publish Date - Aug 30 , 2025 | 10:55 AM
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భిణిని చేశాడంటూ నటుడు మాదంపట్టి రంగరాజ్(Madhampatty Rangaraj)పై ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డా (Fashion designer Joy Crizildaa) ఆరోపించారు
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భిణిని చేశాడంటూ నటుడు మాదంపట్టి రంగరాజ్(Madhampatty Rangaraj)పై ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిసిల్డా (Fashion designer Joy Crizildaa) ఆరోపించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం చెన్నై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ... మాదంపట్టి రంగరాజ్ 'మాదంపట్టి కేటరింగ్' సంస్థను నడుపుతుండగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు.
ఈ నేపథ్యంలో ఆయనకు తనతో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ తర్వాత చెన్నైలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకుని ఒకే ఇంటిలో కాపురం ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం తాను ఆరు నెలల గర్భిణిని అని, తనను వదిలివెళ్ళిపోయారని పేర్కొన్నారు. తనను పెళ్లి పేరుతో మోసం చేశారని, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. నటుడిగా, సెలెబ్రిటీ చెఫ్ పొందిన మాదంపట్టి రంగరాజ్ మెహందీ సర్కస్, పెంగ్విన్ చిత్రాల్లో నటించారు.
ALSO READ: Allu kanakaratnam: అల్లు అరవింద్‌కు మాతృ వియోగం
Kenisha: రవి మోహన్ ప్రతిభ ప్రపంచానికి తెలియాలి