Kenisha: రవి మోహన్‌ ప్రతిభ ప్రపంచానికి తెలియాలి

ABN , Publish Date - Aug 30 , 2025 | 10:05 AM

హీరో రవి మోహన్‌ (Ravi Mohan) ప్రతిభ ఈ ప్రపంచానికి తెలియాలని, ప్రజలు చూడాలని ప్రముఖ నేపథ్యగాయని కెనిషా (Kenisha) ఫ్రాన్సిస్‌ అన్నారు.

హీరో రవి మోహన్‌ (Ravi Mohan) ప్రతిభ ఈ ప్రపంచానికి తెలియాలని, ప్రజలు చూడాలని ప్రముఖ నేపథ్యగాయని కెనిషా (Kenisha) ఫ్రాన్సిస్‌ అన్నారు. చెన్నైలో రవిమోహన్‌ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగ్గా అందులో కెనిషా పాల్గొని ప్రసంగిస్తూ, ‘నేను నేపథ్యగాయని. ఇండిపెండెంట్‌ సంగీత నృత్య కళాకారిణి. ఇపుడు రవి మోహన్‌ స్టూడియోలో భాగస్వామిని. ఈ అవకాశాన్ని కల్పించిన రవి మోహన్‌కు ధన్యవాదాలు. చాలాకాలంగా నేను ఒంటరిగా ఉంటున్నా. ఇపుడు రవి ద్వారా ఇంతమంది అందమైన మంచి మనుషులను చూడగలుగుతున్నా. ఈ స్టూడియోను మరింతగా విస్తరించాలని భావిస్తున్నా. అదే మా ఇద్దరి కల.

ayam.jpg

ఇక రవి మోహన్‌ విషయానికి వస్తే, అతను ఎంతో క్లిష్టపరిస్థితిని ఎదుర్కొన్నారు. అతనిలో ఎంత బాధ ఉన్నప్పటికీ బయటకు చూపించరు. ఇపుడు రవికి చెందిన ఏడు స్ర్కిప్టులు నా వద్ద ఉన్నాయి. అతని ప్రతిభను ఈ ప్రపంచం చూడాలి. నాకు ఒక అత్యాశ కూడా ఉంది. రవి మోహన్‌లోని దైవ గుణాన్ని ఈ ప్రజలంతా చూడాలి. ఆ దేవుడుని నేను చూశా. విజయం సాధించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఆ విజయం కోసం ఆయన ఎంతగానో శ్రమించారు. రవి మోహన్‌ ఎంత మంచి వ్యక్తో ఆయన తల్లి వరలక్ష్మితో ఒక రోజు గడిపితే తెలుస్తుంది. అలాంటి మంచి వ్యక్తిని ఇచ్చినందుకు వరలక్ష్మి అమ్మకు ధన్యవాదాలు’ అన్నారు. కాగా, రవిమోహన్‌ స్టూడియో ప్రారంభోత్సవంలో కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌, హీరోలు కార్తి, శివకార్తికేయన్‌, హీరోయిన్‌ జెనీలియా తదితరులు పాల్గొని విషెస్‌ చెప్పారు.

ALSO READ: Allu kanakaratnam: అల్లు అరవింద్‌కు మాతృ వియోగం

Joy Crizildaa: గర్భిణిని చేసి మోసం చేశాడు..

Updated Date - Aug 30 , 2025 | 12:26 PM