Vishwambhara: అందమైన చందమామలా మెరిసిపోతున్న ఆషికా

ABN , Publish Date - Aug 05 , 2025 | 03:17 PM

ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో విశ్వంభర (Vishwambhara) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు.

Ashika Ranganadhan

Vishwambhara: ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో విశ్వంభర (Vishwambhara) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. బింబిసార సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వశిష్ట కు చిరు మెగా చాన్స్ ఇచ్చాడు.దీంతో ఆ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకొనే పనిలో పడ్డాడు ఈ కుర్ర డైరెక్టర్. ఇక మొట్ట మొదటిసారి చిరు సినిమాను యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పటికే వీరిద్దరి కాంబోలో స్టాలిన్ సినిమా వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


త్రిష తో పాటు విశ్వంభరలో మరో హాట్ బ్యూటీ కూడా నటిస్తుంది. ఆమె ఆషికా రంగనాథన్. నా సామీ రంగ సినిమాలో నాగ్ సరసన నటించి విమర్శకుల ప్రశంసలను సైతం దక్కించుకున్న ఆషికా ఆ తరువాత అడపదడపా సినిమాల్లో కనిపిస్తూ వచ్చింది. ఇక చివరగా ఈ ముద్దుగుమ్మ మెగా ఛాన్స్ పట్టేసింది. విశ్వంభరలో ఆషికా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అంటే సెకండ్ హీరోయిన్ గా చిరు సరసన నటించే ఛాన్స్ అనే చెప్పుకొస్తున్నారు.


నేడు ఆషికా పుట్టినరోజు కావడంతో ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నిండైన చందమామలా లంగా ఓణీ వేసుకొని అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా ఆషికాకు మంచి పేరు వస్తుందనే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఒక ఐటెంసాంగ్ లో నటిస్తోంది. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. త్వరలోనే విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఆషికా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tollywood: 'మా' మద్దతు మాకే అంటున్న ఛాంబర్...

Director SJ shiva: నిర్మాతల డబ్బు విరాళంగా మారుతోంది

Updated Date - Aug 05 , 2025 | 03:54 PM