Ashika Ranganath : మెగా ఛాన్స్‌

ABN , Publish Date - May 25 , 2024 | 06:13 AM

నా సామిరంగా’ చిత్రంలో తన లుక్స్‌, నటనతో అందరినీ ఆకట్టుకొన్న ఆషికా రంగనాథ్‌కు మెగా ఛాన్స్‌ లభించింది. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విశ్వంభర’లో ఆమె ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. వశిష్ట v

Ashika Ranganath : మెగా ఛాన్స్‌

‘నా సామిరంగా’ చిత్రంలో తన లుక్స్‌, నటనతో అందరినీ ఆకట్టుకొన్న ఆషికా రంగనాథ్‌కు మెగా ఛాన్స్‌ లభించింది. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విశ్వంభర’లో ఆమె ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ అత్యంత భారీ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన ముగ్గురూ ఎవరా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాంటసీ, యాక్షన్‌, అడ్వెంచర్‌ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ‘విశ్వంభర’ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన విడుదలవుతుంది. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాకు నిర్మాతలు.

Updated Date - May 25 , 2024 | 06:13 AM