The Rajasaab: రాజాసాబ్ ఫస్ట్ సింగిల్.. హైప్ పెంచేసిన SKN
ABN, Publish Date - Sep 10 , 2025 | 09:26 PM
పాన్ ఇండియా ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే డార్లింగ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
The Rajasaab: పాన్ ఇండియా ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే డార్లింగ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ది రాజాసాబ్ (The Rajasaab). మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మొట్ట మొదటిసారి ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. వారే మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్.. వీరు మాత్రమే కాకుండా మరో స్టార్ బ్యూటీ ఐటెంసాంగ్ లో కూడా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే రాజాసాబ్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ అయితే వింటేజ్ డార్లింగ్ ను గుర్తుచేసింది అని చెప్పొచ్చు. అని బావుంటే.. డిసెంబర్ లో రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, విఎఫ్ఎక్స్ పని ఇంకా పూర్తి కాకపోవడంతో.. ఈ సినిమా సంక్రాంతికి వాయిదా పడింది. ఒక నెల అటు ఇటు అయినా.. హైప్ పెంచడంలో SKN ఎక్కడా తగ్గడం లేదు.
తాజాగా నిర్మాత SKN.. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చాడు. తాను విన్నాడన్న ఆనందమా.. ? లేక వస్తుందన్నా ఆనందమా అనేది తెలియదు కానీ.. మంటలో అస్థిపంజరం తగలాడిపోయే గిఫ్ ను షేర్ చేస్తూ ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ అంటూఫైర్ ఎమోజీలతో పోస్ట్ మొత్తం నింపేశాడు. దీంతో సాంగ్ అదిరిపోయిందని మాత్రం ఫ్యాన్స్ అర్ధం చేసుకున్నారు. ఇక దింపు.. దింపు.. అప్డేట్ దింపు .. ఎదురుచూస్తున్నాం.. ఈ సాంగ్ కు థియేటర్లు తగలపడిపోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలోనే రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ గురించి మేకర్స్ ప్రకటించనున్నారేమో చూడాలి.
Karishma Kapoor: రూ. 1900 కోట్లు తీసుకున్నారు.. ఇంకా సరిపోలేదా
Thursday Tv Movies: గురువారం, సెప్టెంబర్11న.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే