Mayasabha sonyliv: మయసభలో ఎన్టీఆర్‌గా డైలాగ్‌ కింగ్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:45 PM

ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో కానీ, ‘తుక్కు రేగ్గొట్టారు’ తెలుగు ప్రేక్షకులు ఆగస్ట్‌ 7న మరోసారి మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు

‘ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో కానీ, ‘తుక్కు రేగ్గొట్టారు’ తెలుగు ప్రేక్షకులు ఆగస్ట్‌ 7న మరోసారి మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు’.. అంటూ సాయికుమార్‌ను (Sai kumar) ఉద్దేశించి దర్శకుడు దేవా కట్టా (Deva Katta) చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం సోనీలివ్‌ ఓటీటీ కోసం దేవా కట్టా ‘మయసభ’ (Maya sabha) సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 7వ తేదీ నుంచి ఇది  స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇందులో సాయికుమార్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నారని చెబుతూ ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ప్రస్థానం’ ‘ఆటోనగర్‌ సూర్య’ తర్వాత ‘మయసభ’తో మూడవసారి పని చేయడం చాలా ఎంజాయ్‌ చేశాను. నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా మీకు నచ్చిన పాత్రలు చేస్తూ లైఫ్‌ ఎంజాయ్‌ చేయాలని మీ అభిమానిగా ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కారులో కూర్చుని అభివాదం చేస్తున్న సాయికుమార్‌ పోస్టర్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. సాయికుమార్‌ పోషించిన పాత్ర ఏంటా అని ఆరా తీస్తున్నారు. అయితే ఇద్దరు ేస్నహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారనే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో సాయికుమార్‌ ఎన్టీఆర్‌ పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. ఇందులో ఆది పినిశెట్టి, చైతన్య రావు కీలక పాత్రలు పోషించనున్నారు. ఏపీ చరిత్రను మలుపు తిప్పిన రాజకీయ పరిణామాల చుట్టూ దేవా కట్టా ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఆగస్టు 7వ తేదీ నుంచి సోనీలివ్‌లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.


Also Read.. ఇవి కూడా చ‌ద‌వండి

థియేట‌ర్ల‌లో.. నరసింహవ‌తారం సంచ‌ల‌నం! భ‌జ‌న‌లు, కీర్త‌న‌ల‌తో హంగామా

Ponnambalam: నా కష్టం.. పగవాడికి కూడా రాకూడదు

స‌రికొత్త‌గా.. వీర‌మల్లు! ఆ సీన్లు క‌ట్‌.. కొత్త‌వి ఇన్

కింగ్డ‌మ్ ట్రైల‌ర్‌.. అభిమానుల‌కు పూన‌కాలు

ఓటీటీకి వ‌స్తోన్న‌.. త‌మ్ముడు! జ‌నం కరుణించేనా

డైలాగ్ కింగ్‌ బ‌ర్త్ డే.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల సునామీ

ఆ ఓటీటీకి.. వీర‌మ‌ల్లు! ఎప్ప‌టినుంచంటే

Updated Date - Jul 28 , 2025 | 12:32 PM