సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telusu Kada: డీజే టిల్లును.. మించి ఉందిగా! తెలుసుక‌దా టీజ‌ర్‌

ABN, Publish Date - Sep 11 , 2025 | 02:29 PM

జాక్ వంటి భారీ డిజాస్ట‌ర్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ నుంచి వ‌స్తున్న చిత్రం తెలుసు క‌దా.

Telusu Kada

జాక్ వంటి భారీ డిజాస్ట‌ర్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ (Siddu Jonnalagadda) నుంచి వ‌స్తున్న చిత్రం తెలుసు క‌దా (Telusu Kada). రాశీ ఖ‌న్నా (Raashii Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) క‌థానాయిక‌లు. ఈ మూవీతో ప్ర‌ముఖ స్టైలిస్ట్ నీర‌జ కోన (Neerraja Kona) ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇస్తుండ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ (People Media Factory) బ్యాన‌ర్‌పై విశ్వ ప్ర‌సాద్ (TG Vishwa Prasad) నిర్మించాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆక్టోబ‌ర్ 17న థియేట‌ర్లోకి రానుంది.

సినిమా విడుద‌ల‌కు ఇంకా అటు ఇటు రెండు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టినుంచే సినిమాను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు మేక‌ర్స్ న‌డుం బిగించారు. ఈ క్ర‌మంలో ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పాట‌లు, గ్లింప్స్ సినిమాపై మంచి అటెన్ష‌న్‌ను తీసుకు వ‌చ్చాయి. దీంతో మేక‌ర్స్‌ తాజాగా గురువారం ఈ మూవీ టీజ‌ర్ సైతం విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సిద్ధు నుంచి ఆడియ‌న్స్ కోరుకునే అన్నీ అంశాల‌ను రంగ‌రించి మ‌రి ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. నిమిషం 30 సెక‌న్లు ఉన్న ఈ టీజ‌ర్ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్‌గా, ప్రేక్ష‌కుల‌ను క‌వ్వించేలా క‌ట్ చేశారు. అలాగే సిద్దు నోట వ‌చ్చే డైలాగులు సైతం డీజే టిల్లును మ‌రిపించే త‌ర‌హాలో ఉండ‌డం విశేషం.

ఓ హ‌ల్దీ పంక్ష‌న్‌లో హీరో ఇద్ద‌రు హీరోయిన్లకు ప‌సుపు పూయ‌డం, నాకు రాసిపెట్టి ఉన్న అమ్మాయి త‌నంత‌ట తానే రావాల‌ని అని హీరో చెప్పడం, ఆ మ‌రుక్ష‌ణం ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఎంట్రీ ఇవ్వ‌డం, ఆపై హ‌ర్ష చెప్పే నీకు ఇష్టం క‌దా ఇలా ఇద్ద‌రిద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య దూర‌డం, మ‌రో సీన్‌లో హీరో 70% ఏంజ‌ల్‌,30% డెవిల్ నువ్వు అంటూ హీరో చెప్పే డైలాగులు కుర్ర‌కారును ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. చివ‌ర‌కు ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు హీరోను డ్రెస్సింగ్‌, త‌మ క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో హీరోను ముగ్గులోకి దింపేందుకు ట్రై చేయ‌డం సీన్ల‌తో టీజ‌ర్‌ను ముగించారు.

ఇలా టీజ‌ర్ అసాంతం రొమాంటిక్‌గా ఉండి, యూత్‌ను టార్గెట్‌గా చేసిన‌ట్లు ఉంది. చాలా స‌న్నివేశాల్లో డీజే టిల్లు ఛాయ‌లు సైతం క‌నిపించాయి. అయితే.. ఈ టీజ‌ర్ కొన్ని టికెట్లు తెంపేదిగా ఉండ‌గా.. త్వ‌ర‌లో వ‌చ్చే ట్రైల‌ర్ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉండ‌బోయేది తేల్చ‌నుంది. చూడాలి మ‌రి ఈ తెలుసు క‌దా (Telusu Kada) సినిమా అయినా సిద్ధుకు మంచి విజ‌యం అందిస్తుందో లేదో.

Updated Date - Sep 11 , 2025 | 02:46 PM