Rajendra Prasad: అది మీ ఖర్మ.. నేను ఇలాగే ఉంటా! అసభ్యకర కామెంట్స్‌పై రాజేంద్ర ప్రసాద్
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:53 PM
ఇటీవల నటుడు రాజేంద్ర ప్రసాద్ తోటి నటులపై జారుతున్న మాటలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. వాటిపై ఆయన స్పందించారు.

ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) పాల్గొంటున్నకార్యక్రమాల్లో ఆయన వ్యవహారం, తోటి నటులపై జారుతున్న మాటలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం రాబిన్ హుడ్ సమయంలో డేవిడ్ వార్నర్‌పై తాజాగా ఆదివారం ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకల్లో అలీపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆ అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీయడమే కాకుండా రాజేంద్ర ప్రసాద్ పై తీవ్ర విమర్శలు తెచ్చి పెడుతున్నాయి. అయితే గతంలో వార్నర్ విషయంలో తప్పైంది అంటూ క్షమాపణలు చెప్పిన నట కిరిటీ ఆదివారం అలీపై మాటల విషయంలో భిన్న వైఖరి అవలంభించారు.
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ముఖ్య పాత్రలో నటించిన షష్టిపూర్తి సినిమా సక్సెస్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కొన్ని ఫంక్షన్లలో నేను గబుక్కున మాట్లాడుతున్న మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ ఖర్మ, మీ సంస్కారం మీదనే ఆధార పడి ఉంటుంది అందుకు నేనేమి చేయలేను. నేనైతే ఇలాగే ఉంటా, సరదాగా ఉంటా.. అంటూ జవాబిచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతూ రాజేంద్రుడిపై కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఒరేయ్ అలీగా.. బూతులతో మళ్లీ నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్
తెలుగులోను ఓటీటీకి వచ్చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ.. అసలు వదలకండి!
ఓటీటీకి.. సమంత నిర్మించిన హర్రర్, కామెడీ! ఎక్కడ చూడాలంటే!
రజనీకాంత్‌కు నిద్ర కరువు చేసిన సినిమా.. ఎట్టకేలకు ఓటీటీకి లాల్ సలామ్!
శివ కార్తికేయన్, శ్రీలీల పరాశక్తి.. విలన్‌గా జయం రవి