Rajendra Prasad: ఒరేయ్ అలీగా.. బూతులతో మళ్లీ నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:18 AM
ఇటీవల సినిమా సంబంధిత కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడుతూ ఇతర నటులపై నోరు పారేసుకోవడం సీనియర్ ఆర్టిస్టలుకు పరిపాటి అయిపోయింది.
ఇటీవల సినిమా సంబంధిత కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడుతూ ఇతర నటులపై నోరు పారేసుకోవడం సీనియర్ ఆర్టిస్టలుకు పరిపాటి అయిపోయింది. ఇలాంటి వార్తల్లో ముందు వరుసలో ఉంటున్నాడు 50 ఇయర్స్ ఇండస్ట్రీ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad). ఆ మధ్య నితిన్ రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్‌లో వార్నర్‌ను దొంగ ము** కొడుకు, రేయ్ అంటూ సంబోధించి ఒక్కసారిగా అక్కడి వారిని షాక్‌కు గురి చేశాడు. ఆపై పలు కార్యక్రమాలలో పాల్గోని కేర్‌లెస్‌గా వ్యవహరించిన వీడియోలు కాస్త బయటకు రావడంతో ఆయనపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ సైతం జరిగింది.
ఆ తర్వాత వార్నర్‌కు క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఎస్వీ కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకలో పాల్గొన్న సమయంలో తోటి నటుడు, కమెడియన్ అలీపై ఎక్కడా ఆ లం.. కోడుకు అంటూ మరోసారి నోరు పారేసుకున్నాడు. అంతేకాక ఈ కార్యక్రమం గురించి నాకు ఆలస్యంగా తెలిసిందని, నిన్న ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి ఏపీకి వెళ్లానని అన్నారు. అప్పుడూ ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో ఏంటీ మీరు చప్పట్లు కొట్టరా.. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తే చప్పట్లు కొట్టరా.. బ్రెయిన్ పోయిందా, చప్పట్లు కొట్టకుంటే వారికి సిగ్గులేనట్లే అంటూ మురళీ మోహన్ సమక్షంలోనే నోటికి వచ్చిందల్లా మాట్లాడేశారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ వ్యవహారశైలిపై నెట్టింట పెద్ద జర్చే జరుగుతంది. వయసు పెరుగుతున్న కొద్ది అవతలి వారికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఎందుకు తోటి వారిని ఇంతలా డీ గ్రేడ్ చేయడం, చులకనగా మాట్లాడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
45 యేండ్ల నటనా అనుభవం ఇదే నేర్పింది, ఇదేనా పెద్దరికం ఇతరులకు ఇచ్చే మర్యాద అంటూ నెటిజన్లు ఏసుకుంటున్నారు. నొరెత్తితే ఎన్టీఆర్ ఇంట్లో పుట్టా, ఎన్టీఆర్ గారి తల్లి చేతుల్లో పెరిగా అని చెప్పుకునే ఈ నటుడిని ఇలానే పెంచారా అని ఆ ఫ్యామిలీకి మచ్చ తెచ్చేలా చేస్తున్నాడు. ఆయనేదో సరదాగా మాట్లాడుతూ అలాంటి మాటలు అన్నప్పటికీ, వారిద్యరి మధ్య అంత రాపో ఉన్నా పది మంది ముందు , పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు మాత్రం నోరు ఆదుపులో పెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇన్నాళ్లు సినిమాల ద్వారా తెచ్చుకున్న పేరును రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇలాంటి వ్యాఖ్యలతో చెడగొట్టుకోకూడదని అసలు అవసరమయినా ఇకపై ఏ సినిమా ఫంక్షన్లకు పోకుండా ఉంటేనే మంచిదని ఆయన అభిమానులు, సినీ లవర్స్ కోరుతున్నారు.