Parasakthi: శివ కార్తికేయన్, శ్రీలీల పరాశక్తి.. విలన్‌గా జయం రవి
ABN , Publish Date - Jun 02 , 2025 | 10:43 AM
జయం రవి, శివ కార్తికేయన్, ఆథ్వర్వ మురళి, శ్రీలీల కాంబినేషన్‌లో తెలుగు దర్శకురాలు అకాశమే హద్దురా ఫేం సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్న చిత్రం పరాశక్తి.
జయం రవి (Ravi Mohan), శివ కార్తికేయన్ (Sivakarthikeyan), ఆథ్వర్వ మురళి (Atharvaa), శ్రీలీల (Sreeleela) కాంబినేషన్‌లో తెలుగు దర్శకురాలు అకాశమే హద్దురా ఫేం సుధా కొంగర (Sudha Kongara) డైరెక్ట్ చేస్తున్న చిత్రం పరాశక్తి (Parasakthi). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. పొలిటికల్ పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి పాన్ ఇండియాగా విడుదల చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నారు.
గత సంవత్సరం అమరన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమా అవడం, సూర్యతో ఆకాశమే హద్దు వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రం తర్వాత సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న సినిమా అవడంతో షూటింగ్ ఫ్రారంభం నుంచే హైప్ ఏర్పడింది. దానికి తోడు సౌత్ సెన్షేషన్, తెలుగమ్మాయి శ్రీలీల ఈ సినిమాతో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం. జీవీ ప్రకాశ్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందించనున్నాడు.
1965లో తమిళనాట జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం వాస్తవ ఘటనల ఆధారంగా సుధా కొంగర 2023లో సూర్య (Suriya), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), విజయ్ వర్మ (Vijay Varma), నజ్రియా (Nazriya Nazim) కాంబినేషన్‌లో ఈ సినిమాను ప్రకటించినా అది ముందుకు పడలేదు. ఆపై అనుహ్యంగా వారి స్థానాల్లో శివ కార్తికేయన్, రవి, ఆథర్వ, శ్రీలీల లీడ్ రోల్స్‌తో బసిల్ జోసెఫ్ (Basil Joseph), గురు సోమసుందరం (Guru Somasundaram) ఇతర పాత్రల్లో 2024లో ఈ సినిమాను ప్రారంభించారు.
అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది మొదలు రోజుకో రకమైన అప్డేట్స్ బయటకు వస్తు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇప్పటికే సినిమాలో ఆథర్వ మురళి కీ రోల్‌లో నటిస్తుండగా శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ మూవీలో జయం రవి ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. గత సంత్సరం మణిరత్నంతో పొన్నియన్ సెల్వన్ టైటిల్ రోల్ చేసిన రవి మోహన్ ఇప్పుడు మొదటి సారిగా విలన్‌గా చేయడం తమిళనాట ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా హాల్‌చల్ చేస్తున్నాయి.