Subham OTT: ఓటీటీకి.. సమంత నిర్మించిన హర్రర్, కామెడీ! ఎక్కడ చూడాలంటే!
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:24 PM
గత నెల మే రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను రాబట్టుకున్న చిత్రం శుభం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
గత నెల మే రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను రాబట్టుకున్న చిత్రం శుభం (Subham). సమంత (Samantha) మొదటిసారిగా నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మించడం విశేషం. కరోనా సమయంలో ఓటీటీలో వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాబండి అనే సినిమాతో ఆకట్టుకున్న ప్రవీణ్ కండరేగుల (Praveen kandregula) మలి ప్రయత్నంగా ఈ చిత్రానికి దర్వకత్వం వహించారు. హర్షిత్ రెడ్డి (Harshith Reddy), గవిరెడ్డి శ్రీనివాస్ (Gavireddy Srinivas), చరణ్ పేరి (Charan Peri), శ్రీయ కొంతం (Shriya Kontham), శ్రావణి లక్ష్మి (Shravani Lakshmi), శాలిని కొండెపూడి (Shalini Kondepudi) కీలక పాత్రలు చేశారు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. భీముని పట్నంలో కేబుల్ టీవీ ఆపరేటర్ కమ్ ఓనర్ శ్రీనివాస్ (హర్షిత్ రెడ్డి)తన మిత్రులతో సరదాగా కాలం వెళ్లదీస్తుంటాడు. అదే ఊరిలో బ్యాంక్‌లో పని చేసే శ్రీవల్లి (శ్రియ కొంతం)ని పెళ్లి చేసుకుంటాడు. అయితే.. అతని శోభనం రోజు భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. ఆపై వాకబు చేస్తే.. ఆ ఊరి మొత్తంగా మగాళ్ళందరి పరిస్థితి అదేనని తెలుస్తుంది. రాత్రి తొమ్మిది కాగానే ఊరిలోని లేడీస్ అంతా జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ దెయ్యాలు ఆవహించినట్టుగా వింతగా ప్రవర్తిస్తూ.. అడ్డుకునే భర్తలపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తీరా సీరియల్ పూర్తయ్యాక ఏమీ జరగనట్లు మాములుగా ఉంటారు. తమ పరువు ఎక్కడ పోతుందోనని మగవాళ్లు బయటకు చెప్పరు.
దీని నుంచి బయట పడడానికి శ్రీను బృందం మాయ మాతాశ్రీ (సమంత)ను ఆశ్రయిస్తారు. మాయ ఏం చెప్పింది? జన్మజన్మల బంధం సీరియల్‌కి , ఆత్మలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా? అసలు ఇందులో మాయ పాత్ర ఏంటి? చివరికి ఏం జరిగిందన్నది ‘శుభం’ కథ. సినిమా మొత్తం సీరియల్ చుట్టూ తిరిగే హారర్-కామెడీ కథ. అయితే కథ, కథనం స్లోగా సాగినా కాన్పెస్ట్ కొత్తగా ఉండి ఫర్వాలేదనిపిస్తోంది.ఇప్పుడీ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లో మిస్సయిన వారు, ఫ్యామిలీతో చూడాలనుకునే వారు ఈ శుభం (Subham) మూవీని ఒకసారి ప్రయత్నించవచ్చు.