OG Concert: ఓజీ కన్సర్ట్.. స్టేడియం దద్దరిల్లడం ఖాయం
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:55 PM
టాలీవుడ్ ఎదురుచూస్తున్న ఓజీ (OG) తుఫాన్ రాకకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో బాక్సాఫీస్ తీరాన్ని తాకబోతోంది.
OG Concert: టాలీవుడ్ ఎదురుచూస్తున్న ఓజీ (OG) తుఫాన్ రాకకు రంగం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లో బాక్సాఫీస్ తీరాన్ని తాకబోతోంది. ఎన్ని రికార్డుల విధ్వంసం సృష్టిస్తుందో.. ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ తుఫాన్ తీవ్రతను పెంచడానికి రెండు తెలుగు రాష్ట్రాలు రంగం సిద్థం చేశాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్న మూవీ ఓజీ. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో, డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. దానికి తగ్గట్టే ప్రచారం కూడా పీక్స్ కు చేరుకుంది. పవన్ కళ్యాణ్ ఓజస్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తున్నాయి. ఓజీ సినిమాకు తమన్ ఇచ్చిన ట్యూన్స్ అదిరిపోయాయి. ‘ఫైర్ స్ట్రామ్’, ‘సువ్వి సువ్వి’, ‘గన్స్ అండ్ రోజెస్’ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన వాషి యో వాషి పాట దుమ్మురేపుతుంది. ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 25 వస్తుందా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక ఓజీ సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఒక్క ప్రెస్ మీట్ కానీ, ఇంటర్వ్యూ కానీ లేకుండా డీవీవీ మేకర్స్ చేసిన ప్రమోషన్స్ చూస్తే మెంటలోచ్చేస్తుంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో రచ్చ చేసిన మేకర్స్.. ఇక ఇప్పుడు ఓజీ కన్సర్ట్ తో తుఫాన్ సృష్టించబోతున్నారు. సెప్టెంబర్ 21 సాయంత్రం ఎల్.బి. స్టేడియంలో ఈ ఈవెంట్ జరగబోతుందని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
ఇక ఈ వీడియోలో ఓజీ కోసం అభిమానులు ఎంతగా తపిస్తున్నారో రుజువు చేసే ఫ్యాన్స్ వీడియోలను చూపించారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధులు ఫ్యాన్స్ మాత్రమే అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక రేపు రచ్చ చేయడానికి సిద్దంగా ఉండమని హింట్ కూడా ఇచ్చారు. రేపు ఎల్ బి స్టేడియం దద్దరిల్లడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ వేడుకలో పవన్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో చూడాలి.