OG Trailer: గంభీర.. ఓజాస్‌ గంభీర.. నాకొడకల్లారా..

ABN, Publish Date - Sep 22 , 2025 | 02:49 PM

'ఓజీ’ చిత్రం నుంచి ఇప్పటివరకూ విడుదలైన గ్లింప్స్‌, సాంగ్స్‌, లుక్స్‌ ఇలా ప్రచార చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని ఫిదా చేశాయి. సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. ఇప్పుడు ట్రైలర్‌ వంతు వచ్చింది. దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆదివారం జరిగిన ఓజీ కాన్సెర్ట్‌లో డిఐ వర్క్‌ కంప్లీట్‌ కాకపోయిన ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకుల కోసం పవన్‌ కల్యాణ్‌ దర్శకుడి అనుమతితో ప్రదర్శన చేశారు. ఇప్పుడు ట్రైలర్‌ అధికారికంగా విడుదలైంది. సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా వచ్చిన ట్రైలర్‌ను మీరు చూసేయండి...

Updated at - Sep 22 , 2025 | 03:45 PM